కథ :
సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) తాను ప్రేమించిన అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను వదిలి తన కూతురు రియాతో బయటకు వచ్చేస్తుంది. తన ఫ్రెండ్ లాయర్ రాహుల్ (శశాంక్) ఆపదకాలంలో సాయపడుతుంటాడు. మరో వైపు సూర్య (మైమ్ గోపీ) రియా కోసం అందరినీ చంపుతుంటాడు. రియా తన కూతురేనని తనకు ఇచ్చేయమని సంజనను బెదిరిస్తుంటాడు. కానీ సూర్య అనే వాడు లేడని, ఎప్పుడో చనిపోయాడని లాయర్ రాహుల్, పోలీసులు చెబుతారు. అసలు సంజన, అరవింద్‌లు ఎందుకు విడిపోతారు? సంజన గతం ఏంటి? చివరకు తన కూతురు రియా కోసం సంజన ఏం చేస్తుంది? ఈ కథలో రాహుల్ పాత్ర ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
సంజన పాత్రలో వరలక్ష్మీ అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించింది. భయస్తురాలిగా, ధైర్యవంతురాలిగా అన్ని రకాల వేరియేషన్స్ చూపించింది. వరలక్ష్మీకి ఇలాంటి పాత్ర చాలా కొత్త. అయినా కూడా అవలీలగా నటించేసింది. ఇక అరవింద్‌గా గణేష్, రాహుల్‌గా శశాంక్, సూర్య పాత్రలో మైమ్ గోపీ చక్కగా నటించారు. ఇది వరకు అలవాటైన పాత్రల్లోనే వారు మెప్పించారు. సునయన, అర్చన, బేబీ నివేక్ష, కృతిక ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ :
కానీ అనిల్ మాత్రం ఈ సినిమాను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలానే తీశాడు. మదర్ అండ్ డాటర్ రిలేషన్, ఎమోషన్‌ను చక్కగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వరలక్ష్మీ పరుగులు పెడుతూనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. తన బిడ్డ కోసం సంజన పడే కష్టం ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కాస్త వణుకుపుట్టించేలా, భయపెట్టించేలా డిజైన్ చేసుకున్నారు.
కథ ఎక్కువగా ముందుకు సాగినట్టు అనిపించదు. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనూ పెద్ద ట్విస్టులేమీ ఉండవు. కూతురి కోసం తల్లి పడే ఆరాటాన్ని సాగదీసి చూపించినట్టుగా కనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అందరూ ఊహించేలానే ఉంటుంది. చక్కని ఎమోషనల్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే చివర్లో కలుగుతుంది.
టెక్నికల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే.. ముందుగా కెమెరా పనితనం గురించి చెప్పాల్సిందే. విజువల్స్ బాగున్నాయి. కొన్ని షాట్స్ భయపెట్టేలా ఉంటాయి. మ్యూజిక్ బాగుంది. ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండుంటే.. అంత బోర్ కొట్టకపోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొదటి సినిమానే అయినా నిర్మాత కథను నమ్మి అద్భుతంగా నిర్మించాడు.
రేటింగ్ 2.75
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి