చిరంజీవి తనయుడు రామచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కు నచ్చలేదా..? ఎందుకంటే మగధీర చిత్ర నిర్మాణం అంతా పూర్తయి రెండు రోజుల్లో విడుదల అవుతుందనగా దర్శకుడు రాజమౌళి దగ్గరకు వచ్చి ’సినిమా బాగానే వచ్చింది కానీ, ఈ సినిమాకు రిపీటెడ్ అడియన్స్ వస్తారంటవా..‘ అని అడిగాడట. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: