తెలుగు వారికి ఖ్యాతిని తెచ్చిన సినిమా అచ్చంగా బాహుబలి అని చెప్పుకోవాలి. ఆ సినిమా అన్ని హద్దులను దాటేసి తెలుగు పతాకను ఖండంతరాలకు ఎగురవేసింది. అయితే సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలోనూ రికార్డులు అన్నవి శాశ్వతం కాదు. వాటిని మించినవి వస్తూనే ఉంటాయి. బాహుబలి వన్ అప్పటికి సూప‌ర్ అనుకుంటే బాహుబలి 2 వచ్చి దాన్ని కొట్టేసింది. 


ఇప్పటికీ బాహుబలి రికార్డులు అలాగే పదిలంగా ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేద్దామని ఆ మధ్యన రజనీకాంత్ 2 జీరో మూవీ వచ్చిందంటారు. అయితే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో బాహుబలి టార్గెట్ ని మిస్ చేసుకుంది. ఇదే టైంలో టాలీవుడ్లో ఓ  సీనియర్ ప్రొడ్యూసర్  2 జీరోపై కొన్ని కామెంట్స్ చేశారు. బాహుబలిని కొట్టడం కష్టమన్న తీరులో ఆయన మాట్లాడారు. పైగా బాహుబలిని కాపీ కొట్టారని కూడా విమర్శించారు.


మరి అంతలా ఒక కమ్యూనిటీ ఓన్ చేసుకున్న మూవీలా బాహుబలి కనిపిస్తోంది. రాజమౌళి ఈ సినిమాను తీస్తే తెలుగు వారు అంతా మాది అనుకున్నారు. పెద్ద హిట్ చేశారు. అలాగే దేశంలోని వారంతా భారతీయ సినిమా అన్నారు. కానీ టాలీవుడ్లో ఓ బలమైన సామాజిక వర్గం మాత్రం ఈ మూవీ క్రెడిట్ మా సొంతం, దాన్ని కొట్టే సినిమా తీస్తే మళ్ళీ రాజమౌళీ మాత్రమే తీయాలంటూ ఓవరాక్షన్ చేస్తున్నారని టాలీవుడ్లోనే కామెంట్స్ వస్తున్నాయి. ఇదే ఇపుడు మిగిలిన వారికి మంట పుట్టిస్తోంది.


ఇదిలా ఉండగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఎవెంజెర్స్ ఎండ్ గేమ్ దేశంలో రికార్డుల విద్వంశం స్రుష్టిస్తోంది. ఈ మూవీ పాత రికార్డులు తిరగరాస్తోంది.  ఈ మూవీపై ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ రివ్యూ రాస్తూ బాహుబలి 2 రికార్డులు బద్దలు అయ్యాయని పేర్కొన్నారు. ఇదిపుడు బాహుబలి నిర్మాత శంభు యార్లగడ్డకు మండిపోయేలా చేసింది. ఒక్క హిందీలోనే బాహుబలి కలెక్షన్లు తీసుకుని ఎవెంజెర్స్ వరల్డ్ కలెక్షన్లో పోల్చడం ఏంటి అని ఆయన ఫైర్ అవుతున్నారు. 
మొత్తానికి చూసుకుంటే రికార్డుల ప్రస్తావన వచ్చినపుడల్లా బాహుబలిని కెలుకుతున్నారు. దాంతో ఆ వర్గానికి మండిపోతోంది. అయితే ఇవాళ అవెంజెర్స్ బాహుబలి  రికార్డులు కొట్టకపోవచ్చు రేపు మరో సినిమా అయినా కొట్టే చాన్స్ ఉందిగా. ఈ నిజం తెలుసుకుంటే చాలు. ఎగిరి పడడాలు, ఓవరాక్షన్లు ఉండవు అంటున్నారు తలపండిన టాలీవుడ్ ప్రముఖులు.


మరింత సమాచారం తెలుసుకోండి: