కొంతమంది ప్రేమలు ఇలాగె ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఇదొక ఇబ్బంది వస్తుంది. రెండు సార్లు పెళ్లి ఆగిపోయింది. మూడోసారి ఎలా అయినా చేసుకోవాలి అనుకున్నారు. కానీ అప్పుడు కూడా పెల్లుకొడుకు తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.. ఇంకా ఇది అయ్యేది కాదులే అని ఆసుపత్రిలోనే పెళ్లి చేసేసుకున్నారు ఆ జంట. 


ఇంకా వివరాల్లోకి వస్తే.. అమెరికాలో ఆలియా(18), మైకెల్ థామ్స(20) అనే ఇద్దరి పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి ఇద్దరి నిశ్చితార్థం జరిగి రెండు సంవత్సరాలు అయింది. ఒకసారి మైకేల్ తండ్రి మిలిటరీలో ఉండటం వల్ల, రెండొవసారి మైకేల్ బంధువులు చనిపోవడం వల్ల వీరి వివాహం వాయిదా పడింది. 


ఇక ఈసారి ఏం జరిగినా పెళ్లి జరగాల్సిందేనని ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా మైకేల్ తండ్రి అనారోగ్యంతో సన్నీవేల్‌లోని బేలర్ స్కాట్ అండ్ వైట్ హెల్త్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సెప్టెంబర్ 21న పేషెంట్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో మైకేల్‌కు ఏం చేయాలో తెలియలేదు. 


ఇదే సమయంలో ఆసుపత్రిలో ఎందుకు పెళ్లి చేసుకోకూడదంటూ ఆలియా మైకేల్‌తో చెప్పింది. పెళ్లి ఆగకూడదు, తండ్రి తన పెళ్లిని చూడాలి.. ఆసుపత్రిని పెళ్లి వేదిక చేసేశారు ఆ ప్రేమికులు. ఆస్పత్రిలో డాక్టరుని, చర్చిలో పాస్టర్ కి ఇదే విషయం చెప్పి ఒప్పించారు.  ఆపరేషన్ థియేటర్‌లో ధరించే దుస్తులు వేసుకుని పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆ ప్రేమ జంటకు వెంటనే సిబ్బంది ప్రత్యేకంగా కేక్, విందు భోజనాన్ని ఏర్పాటు చేసి వారి వివాహాన్ని ఆసుపత్రిలోనే ఘనంగా చేశారు.  ఈ పెళ్లి చూశాక అనిపిస్తుంది మరి.. ప్రేమ ఉంటె పెళ్ళికి వివాహ వేదిక అవసరం లేదని. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: