ప్రస్తుతం కరోనా దెబ్బకు అమెరికాలో ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 14.7% పెరగడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.హెచ్‌-1బీ వంటి పనిఆధారిత కొత్త వీసాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఆ దేశం మొదలు పెడుతోందని తెలుస్తోంది. ఇకపోతే, ‘ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ సలహాదారులు ఓ కొత్త ఆదేశాలకు అనుమతిని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా పని చేసుకోవడానికి అనుమతి ఉన్న విద్యార్థి వీసాలను కూడా రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇందుకోసం డోనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ సలహాదారులు కొత్త ఆదేశిక ప్రణాళికను కూడా తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికను అనుసరించి కొత్త పని ఆధారిత వీసాలను, . ముఖ్యంగా ఈ ప్రభావం హెచ్‌-1బీ, హెచ్ బీ ఉన్న వీసా వారిపై పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఆదేశాలు జారీ చేస్తారా లేదా అన్న విషయం ఎటువంటి స్పష్టత లేదు. అంతేకాకుండా అమెరికాలో నివసించే నిరుద్యోగుల నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకి ప్రత్యేక రాయితీ కల్పించడం వరకు ఎలాంటి విషయం పై ఏ నిర్ణయం తీసుకుంటుంది అని స్పష్టత లేదు అని ప్రముఖ పత్రిక తెలియజేసింది. 


అమెరికాలో కరోనా దెబ్బకు ఒక నెలలోనే రెండు కోట్ల మందికి పైగా వారి ఉద్యోగాలను కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న వారు కూడా 3.3 కోట్లకు పెరిగినట్లు వారి అంచనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆ దేశంలో 13 లక్షల పాజిటివ్ కేసులు ఉండడంతో ఈ ఇబ్బంది అంత వచ్చింది అని చెప్పవచ్చు. అలాగే మరిణించనవారు కూడా ప్రపంచంలో కెల్లా ఆ దేశంలోని అధికంగా ఉన్నారు. కేవలం ఆ ఒక్క దేశంలోనే 70000 మంది చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందొ ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: