యూఎయి వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఇది మీ కోస‌మే. భార‌తీయ ప్ర‌యాణికులు uae ల‌ని అబుధాబి కి రావ‌లంటే తాము విడుద‌ల చేసిన‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌ప్ప‌ని సారిగా పాటించాల‌ని అంది. తాజా భార‌త దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న నేస‌థ్యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని భావించామ‌ని తెలిపారు. తామ దేశం లోకి భార‌తీయులు రావ‌లంటే అవి పాటించాల్సిందే న‌ని తెల్చి చెప్పింది. అబుధాబితో పాటు ఇత‌ర ఎమిరేట్స్ అయిన దుబాయ్‌, షార్జా, అజ్మాన్‌, ఉమ్ అల్ క్వైన్, ఫుజిర‌హా జారీ చేసిన అన్ని ర‌కాల విసాలు క‌లిగిన భార‌తీయ ప్ర‌యాణికుల‌ను అబుధాబి లోకి అనుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దాని కోసం అబుధాబి విమానాశ్ర‌యంలో ఉన్న ప్రొటోకాల్‌ను త‌ప్ప‌క‌ అనుస‌రించాల‌ని తెలిపింది.

దీనితో పాటు భార‌తీయ ప్ర‌యాణికులు పాటించాల్సిన ప‌లు నిబంధ‌న‌ల‌ను ఒక ప్ర‌క‌ట‌న‌లో విడుద‌ల చేసింది. అబుధాబికి బ‌య‌లు దేరే ముందు భార‌తీయులు త‌మ విమానాశ్ర‌యంలో ర్యాపిడ్ పీసీఆర్ టెస్టును త‌ప్ప‌ని స‌రిగా చేయుంచుకుకోవాల‌ని సూచించింది. ప్రయాణానికి రెండు రోజుల ముందు ఈ ప‌రీక్ష చేయించుకోవాల‌ని అంది. అది కూడా ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు పొందిన లాబొరేట‌రీ అయి ఉండాల‌ని సూచించింది. దానికి సంబంధించిన నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల‌ని అంది. అలాగే దానిపై క్యూ ఆర్ కోడ్ ఉండే విధంగా చూడాలి. అలాగే ఐసీఆర్ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రిగా తీసుకుని, ఐసీఆర్ స్మార్ట్ రిజిస్ట్రేష‌న్ వెబ్ సైట్ లో న‌మోదు చేసుకోవాలి. అబుధాబి విమానాశ్ర‌యానికి చేరుకున్న త‌ర్వాత క‌రోన ప‌రీక్ష చేయించుకోవాలి.

 ప్ర‌యాణికులు గుర్తింపు పొందిన వ్యాక్సిన్ తీసుకుంటే ఎయిర్ పొర్టు కు వ‌చ్చిన 4 రోజుల త‌ర్వాత గాని 8 రోజుల త‌ర్వాత గాని త‌ప్ప‌ని స‌రిగా మళ్లీ పీసీఆర్ ప‌రీక్ష చేసుకోవాలి. ఒక వేళ ప్ర‌యాణికులు వ్యాక్సిన్ తీసు కోకుంటే.. వారికి క్వారంటైన్ ఉంటుంది. అలాగే వారికి మెడిక‌ల్ రిస్ట్ బ్యాండ్ ధ‌రించాల్సి ఉంటుంది. వీరు  9వ రోజున పీసీఆర్ ప‌రీక్ష చేసుకోవాలి. ఈ నిబంధ‌న 16 ఎళ్ల లోపు వారికి మిన‌హాయింపు ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోని ప్ర‌యాణికులు ఇత‌ర ఎమిరేట్స్ కు వెళ్లాంటే విమానాశ్ర‌యం వారు కేటాయించిన ట్యాక్సీ లేదా బ‌స్సుల‌లోనే ప్ర‌యాణించాలి. ఈ మార్గద‌ర్శ‌కాల‌ను భార‌తీయ ప్ర‌యాణికులు త‌ప్ప‌ని స‌రిగా పాటించాల‌ని వారి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: