హిందువులకు సంస్కృతీ ఆచార సంప్రదాయాలు అంటే మహా ప్రీతి. హిందువులు జరుపుకునే పండుగలలో ఇవన్నీ పాటిస్తూ దేవుడిపై తమ కున్న భక్తిని చాటి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వినాయకచవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అందరూ ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఒక్క మన దేశం లోనే కాదు విదేశాల్లో కూడా వినాయకచవితిని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు సింగపూర్ లో జరిగిన ఈ వినాయకచవితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్ లో "శ్రీ సాంస్కృతిక కళాసారధి" అధ్యక్షతన వేడుకలు చాలా వైభవంగా జరిపారు.

అయితే ఈ వేడుకలను అక్కడ ఉన్న తెలుగు వారు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా ప్రముఖ కవి గరికపాటి నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. గరికపాటి దాదాపుగా ఒకటిన్నర గంటల పాటు తన ప్రవచనాలను ప్రజలకు వినిపించారు. ఇందులో ముఖ్యంగా వినాయకునికి సంబంధించిన "ముదాకరాత్తమోదకం"  అను స్తోత్రానికి అర్థం చెబుతూ సాగించిన ప్రసంగం అక్కడి వినాయక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ స్తోత్రాన్ని మన నిజ జీవితానికి ముడి పెడుతూ ఆయన వివరించిన ఎన్ని జీవిత సత్యాలు అందరినీ ఆనందింపచేశాయి. మనకు దక్కిన ఈ చిన్న జీవితాన్ని ఎలా బ్రతకాలి అనే విషయాన్ని కూడా వివరించారు గరికపాటి.

గరికపాటి స్తోత్రాల ద్వారా గణేశుని దీవెనలతో పాటు నిజ జీవిత సత్యాలను తెలుసుకున్నాడు నందుకు చాలా సంతోషంగా ఉందని కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఈ దేవుని కార్యక్రమాన్ని దేశ దేశాల్లో ఉన్న భక్తులందరూ తిలకించడానికి  లైవ్ టెలి కాస్ట్ చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి సభ్యులంతా వీడియో కాల్ లో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షులు రత్న కుమార్. మరియు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి స్పాన్సర్   చేసిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్ మరియు ఈగ జూస్ సంస్థలకు   శ్రీ సాంస్కృతిక కళాసారధి సభ్యులు అంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: