అగ్ర రాజ్యమైన అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా కొనసాగుతోంది. అంతేకాదు ఎన్నో చిన్న దేశాలపై ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తుంది అమెరికా.  అయితే అగ్రరాజ్యమైన అమెరికా పై ఒక అపవాదు ఉంది అన్న విషయం తెలిసిందే. అవసరమైనప్పుడు ఇతర దేశాలతో స్నేహం చేయడం అవసరం తీరిపోయిన తర్వాత అర్ధాంతరం గా మిత్ర దేశాల కు  వెన్నుపోటు పొడవటం అమెరికా కు వెన్నతో పెట్టిన విద్య అని అంటూ ఉంటారు ఎంతో మంది. అయితే ఇక అమెరికా చేసే పనులు కూడా కొన్ని కొన్ని సార్లు ఇది నిజమే అనిపించేలా చేస్తూ ఉంటాయి.


 ఎన్నో దేశాల  విషయం లో  ఇలా అవసరాల కోసం స్నేహాన్ని ఏర్పరచుకుని ఆ తర్వాత అవసరం తీరాక దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎప్పుడూ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశాన్ని అమెరికా వాడుకొని వదిలేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కరోనా వైరస్ కష్టకాలంలో అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయ్. ఇక పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది అని చెప్పాలి.  ఒకవైపు ఆహార సంక్షోభం మరోవైపు ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. కనీసం అక్కడ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి పాకిస్తాన్లో ఏర్పడింది.



 ఇలాంటి సమయం లో అమెరికా పాకిస్థాన్కు ఎలాంటి సహాయం చేయలేదు అని చెప్పాలి.. ఇదే విషయం పై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు. అమెరికా వాడుకుని వదిలేసే రకం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకునేందుకు పాకిస్తాన్ ను  ఉపయోగించుకున్న అమెరికా ఇక ఇప్పుడు అవసరాలు తీరిన తర్వాత పక్కన పెట్టేసింది అని అంతేకాకుండా ఆంక్షలు విధిస్తూ మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం సమయం లో చైనా తమకు అండగా నిలిచి ఆదుకుంటుంది అంటూ ఇమ్రాన్ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: