టిక్ టాక్ .. ఈ షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే చైనాకు చెందిన ఈ యాప్ ఇక భారత్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. ఏకంగా చిన్నల నుంచి పెద్దల వరకు అందరిని కూడా తనకు బానిసలుగా మార్చేసుకుంది. ఇక ఎంతోమంది ఎన్ని రకాల పనులు ఉన్న అన్ని పక్కన పెట్టేసి గంటలు తరబడి టిక్ టాక్ లోనే సమయం గడిపే విధంగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది అని చెప్పాలి. ఒక రకంగా మిగతా ఏ యాప్ లకి సాధ్యం కాని రీతిలో టిక్ టాక్ భారత్లో ప్రభంజనం సృష్టించింది అని చెప్పాలి.


 అంతే కాదండోయ్ కొంతమందికి టిక్ టాక్ బాగా ఉపయోగపడింది. ఏకంగా తమ షార్ట్ వీడియోల ద్వారా బాగా పాపులారిటీ సంబంధించి ఇక ఇప్పుడు సెలబ్రిటీగా మారిన వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత మాత్రం ఎంతోమంది యూజర్ల పర్సనల్ సమాచారాన్ని దొంగలిస్తుంది అనే కారణంతో టిక్ టాక్ సహా మరికొన్ని చైనా యాప్స్ పై అటు భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఎంతోమంది నెటిజెన్స్ కొన్నాళ్లపాటు నిరాశలో మునిగిపోయారు. భారత్ లో నిషేధం ఉన్నప్పటికీ మరికొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికీ టిక్ టాక్ అందుబాటులోనే ఉంది అని చెప్పాలి.


 చైనాకు సంబంధించిన టిక్ టాక్ యాప్ కి సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏకంగా ఈ యాప్ తో యూఎస్ భద్రతకు ముప్పు ఉందని ఎఫ్బిఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ ఆరోపించారు. టిక్ టాక్ లోని కంటెంట్ చైనా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. యూజర్ల డేటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఇక యూఎస్ పై గూడ చర్యం చేసే అవకాశం కూడా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. యూజర్లను ప్రభావితం చేయడానికి చైనా ఇక ఈ యాప్ ను వాడుకుంటుంది అంటూ గతంలో కూడా ఈయన ఆరోపణలు చేశారూ అన్న విషయం తెలిసిందే. ఇక దీనిపై అటు యుఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: