దిల్ సుఖ్ నగర్ వరస పేలుళ్లకు నిరసనగా నగరంలో శాంతి యాత్ర నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఉగ్రవాదులు బాంబులు పేల్చి పలువురిని హతమార్చడంతో పాటు పలువురిని గాయపర్చిన సంఘటనను నిరసిస్తూ నగర టిడిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శాంతి యాత్ర చేస్తుండగా ప్యారడైజ్ సమీపంలో పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: