టిఆర్ఎస్ లో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గం ఇంచార్జీలందరికి టిక్కెట్లు ఖాయమని గులాబి పెద్ద బాసు చెబుతుండగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం రాజకీయ పరిస్థితులు  ఇందుకు బిన్నంగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అరవిందరెడ్డి(మంచిర్యాల), మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్యల పరిస్థితులు కూడా అంతగా బాగా లేవని తెలుస్తుంది.

జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్ధితులను బట్టి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మారక తప్పేటట్లు లేదు. ఎందుకంటే ఇప్పడున్నటువంటి సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉండడంతో వీరు భవిష్యత్తులో విజయం సాధించపోవచ్చునని టిఆర్ఎస్ అధిష్టానం అభిప్రాయపడుతుంది. అందుకే  మాటలో మాటగా ఈ ముగ్గురితో అధినేత కెసిఆర్ సమయం వచ్చినప్పుడు సిట్టింగ్ లు కూడా అవకాశం వదులు కోవడానికి సిద్దంగా ఉండాలని ఇప్పటికే సంకేతాలిచ్చినట్లుగా తెలుస్తుంది.

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి పార్టీకి ద్రోహం చేశాడని ఒక ఎమ్మెల్యేపై కెసిఆర్ కు అప్పటినుండే మదిలో నాటిపోయింది. కాగా సమయం కోసం ఎదురు చూస్తున్న కెసిఆర్ కు ఇప్పుడు సమయం దొరికినట్లుంది. కాగా మరో ఎమ్మెల్యే అవినీతిని ఎదుర్కొంటు ప్రజలకు వ్యతిరేకంగా మారారు. మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి గతంలో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత సమస్య సమసిపోయినప్పటికిని అప్పట్లో ఎమ్మెల్యే అరవిందరెడ్డి అధినేత కెసిఆర్ పై నిప్పులు కక్కారు. దీంతో అప్పటినుండే ఇతనికి చెక్ పెట్టాలని నిర్ణయించుకొని ఇదే అదునుగా ప్రక్కన పెట్టడానికి సిద్దమైనట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: