దీంతో మాజీ సీఎం జగన్ ఏ రూట్ లో వెళ్తారు అనే విషయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న తర్వాత మార్చే అవకాశం లేదనే విధంగా పార్టీ వర్గాలలో చర్చలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వైసిపి నేతల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమి నేతలు దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఈరోజు వెళ్లనున్నారు. అలాగే జోగి రమేష్ కుటుంబీకులను కూడా పరామర్శించబోతున్నారు. ఈరోజు ఉదయం 10:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరి ఆ తర్వాత కనకదుర్గమ్మ వారిది, ఆర్టీసీ బస్టాండ్, భీమవరం, మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అనంతరం తిరిగి మళ్లీ మధ్యాహ్నం జగన్ నివాసమైన తాడేపల్లి కి చేరుకుంటారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియజేశారు. మరి ప్రస్తుతం పోలీసులు పెట్టిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పుడు అటు వైసీపీ నేతలు, కూటమి కార్యకర్తలు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రోజున అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడంతో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు చేరడంతో ఇలాంటి ఆంక్షలు విధించారనే విధంగా వైసిపి కార్యకర్తలు నేతలు మాట్లాడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి