2024లో ఎటువంటి అంచనాలు లేకుండా దీపావళి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం క. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం నటించగా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఏకంగా ఈ సినిమా రూ.50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి, కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా చివరిలో క-2 ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ సినిమా 2027 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో మార్పు పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్న సమయంలో ఈ విషయం పైన నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.


గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దర్శక ధ్వయం సుజిత్, సందీప్సినిమా సీక్వెల్ కోసం పనిచేస్తున్నారని, కథ డిమాండ్ చేస్తే హీరోను కూడా మార్చే అవకాశం ఉంటుందని నిర్మాతలు తెలియజేశారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది. హీరో నటన కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటూ ఆయన తెలియజేశారు. దీంతో ఆ సినిమా కథ అక్కడితో ముగిసిందా? లేదా మరో కొత్త కాన్సెప్ట్ తో సీక్వెల్ రాబోతోందా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


ఒకవేళ కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు అయితే, ఎవరు నటిస్తారనే విషయంపై అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ తో పాటు మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉన్నారు. కానీ క వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సీక్వెల్లో నటించలేదని తెలిసి అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయం పైన కిరణ్ అబ్బవరం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మొత్తానికి ఈ విషయం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: