గత కొంతకాలంగా అక్కినేని అభిమానులు అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలని ఎంపిక చేయగా, కొంత భాగం షూటింగ్ పూర్తి చేసి ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ రావడంతో అఖిల్ కచ్చితంగా హిట్ కొడతారని అభిమానులు కూడా భావించారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత శ్రీలీల తప్పుకుంది. దీంతో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? సినిమా ఆగిపోయింది అనుకున్న సమయంలో మరొక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి సాంగును కూడా విడుదల చేశారు మేకర్స్.


మే 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ముందు నుంచే ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు కొన్ని కారణాల చేత ఆ తేదీని మార్చుకున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అఖిల్ సినిమాకి థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వినిపిస్తోంది. లెనిన్ సినిమా వాయిదా పడడానికి ముఖ్య కారణం రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా. పెద్ది సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల చేత ఏప్రిల్ 30 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.


అఖిల్ లెనిన్ సినిమా మే 1న విడుదల చేయాలని భావించిన ఇప్పుడు పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన వస్తుంది కాబట్టి లెనిన్ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మరి మేకర్స్ కొత్త విడుదల తేదీ పైన ఎలాంటి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారో చూడాలి. ఇప్పటికే అఖిల్ కి సరైన సక్సెస్ రాకపోవడంతో సోలో గానే సినిమాని విడుదల చేసి సక్సెస్ కొట్టడం బెటర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: