రాజకీయ నాయకుల వైఖరి బహు విచిత్రం. వారి ఆస్తులపై, వ్యాపారాలపై, కార్యక్రమాలపై, ప్రకృతివనరుల దోపిడీపై, అవినీతీపై, బంధు ప్రీతిపై, చీకటి వ్యవహారాలపై ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా ఎలాంటి నిఘా గాని, సోదా గాని, పరిశీలన గాని, విచారణ గాని చేయకూడదు. అందుకోసమే వీరికి శాసనసభ, పార్లమెంట్ సభ్యత్వం కావాలి. వీళ్ళు నిర్మించుకున్న ఆశా సౌధాలపై దాడులు జరిగితే వీరి రాష్ట్రంపై ప్రజలపై కుట్రతో దాడులు చేసినట్లే. అలా ప్రజల్ని రెచ్చగొట్తి పబ్బం గడుపుకుంటారు. పాలనకు ఆస్థులకు వారి వారసులను తయారు చేసుకుంటారు. పదవిలో ఉండగా వారు చస్తే, వారి "విడో" గాని, సంతానం గాని, సంతానం లేకపోతే ఎవరో వారి కుటుంబ సభ్యులు గాని ప్రజలపై జాలితో దయతో కరుణతో అధికారంలోకి వచ్చే చాకచక్యాన్ని క్రమంగా నిర్మించుకుంటున్నారు. 

chandrababu rahul family కోసం చిత్ర ఫలితం

ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీల కార్యకర్తలుగా ప్రజలు మారకూడదు. పార్టీ సభ్యత్వం అంటే ఆ పార్టీ తామిచ్చిన వాగ్ధానాలు నెఱవేర్చినంత కాలం ఆ పార్టీలో సభ్యత్వం ఉంచుకోవాలి. అసలు పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన వాగ్ధానాలను నెఱవేర్చెలా నాయకత్వాలని కార్యోన్ముఖులను చేసే ఙ్జానం కలిగి ఉండాలి కాని వారింటి కాపలా కుక్క లు కాకూడదు. ప్రజాస్వామ్యంలో వారసత్వానికి స్థానం లేదు. కాని నేడు వారసత్వం నుంచే ప్రజాప్రతినిధులు ఉద్భవిస్తున్నారు. తొలితరం నాయకత్వాల కుటుంబ సభ్యులే తామరతంపరగా రాజకీయ నాయకులౌతున్నారు.

mulayam singh yadav family photo కోసం చిత్ర ఫలితం

99 శాతం నాయకులు వారసత్వంగా వస్తున్నారు. అధికారంలోకి వచ్చి కొనసాగిన క్రమంలో రౌడీలు, గుండాలను పెంచిపోషిస్తూ, కండబలం ఒక ప్రక్కన అధికారంలో అవినీతి సంపాదనతో అర్ధబలం, అవకాశవాదులకు కాంట్రాక్టులు, విపణి వ్యాపారాలకు అనుమతులిస్తూ అంగబలం పెంచుకుంటూ, నేరగాళ్లను సమర్ధిస్తూ వాళ్ళను కాపాడుతూ ఒక ప్రక్క భూకబ్జాలు, ప్రకృతివనరులైన ఖనిజాలు, ఇసుక, జల దోపిడీలు చేస్తూ ప్రకృతివనరులపై ఆధిపత్యం కొనసాగిస్తూ సాధారణ మానవ జీవితాలను కడగండ్ల పాలుచేస్తూ దానినే వారసత్వ విధానంగా కొనసాగిస్తున్నారు.

Lalu family politicians & Leaders కోసం చిత్ర ఫలితం

స్వతంత్ర భారతావనిలో తొలి అధికార కుటుంబం గాంధి - నెహౄ కుటుంబమే. ఈ కుటుంబం "గాంధి" ఇంటిపేరును కూడా కబ్జా చేసి ఏడుదశాబ్ధాలుగా అధికారం అను భవిస్తుంది. ఆ కుటుంబంలో పుట్టిన "కుక్కమూతి పిందె" నేడు భారత్ లో అధికారం కోసం అర్రులు చాస్తుంది.

ntr family tree with photos కోసం చిత్ర ఫలితం

నిజంగా చెప్పాలంటే భారతీయులు మాత్రమే రాజ్యాంగ పదవులకు ప్రజాప్రాతినిధ్యానికి అర్హులు కావటం ఒక జాతీయ అవసరం. అలాంటిది ఈ నెహౄ గాంధి కుటుంబం లోని ఈ తరం అసలు "భారతీయత" కలిగి ఉన్నారా? అనేది ఆలోచించవలసిన విషయం. మనదేశానికి స్వాతంత్రం వచ్చినా విదేశీ మూలాలు రాజ్య పాలనలో అంతం కాలేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో భారతీయులు లేకనా? ఇటాలియన్ సంస్కృతితో సంకరమైన పౌరులు నిజంగా పాలిస్తున్నారు. లేదా పాలనను నిర్దేశిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితి 125 కోట్ల ప్రజలున్న ఇంత పెద్ద భారతావనికి అవసరమా? అదీ వారసత్వ సంపదగా అధికారం కొనసాగటం అంటే మనమింకా బానిస బ్రతులు బ్రతుకుతూనే ఉన్నాం.   


మూలాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి, నందమూరి తారక రామారావు కుటుంబం దాన్నుండి అధికారం హైజాక్ చేసిన నారా చంద్రబాబు నాయుడు, కలవకుంట్ల చంద్రశేఖర రావు ఇలా ఒకే కుటుంబం నుండి పదుల సంఖ్యలో అధికారంలోకి వచ్చారు. వీరికి అధికారం, పదవి, సంపద వారసత్వ హక్కుగా వస్తూవుంది.

kcr family political leaders కోసం చిత్ర ఫలితం

ఈ మద్య పార్టీల కార్యకర్తలకు, ప్రజలకు ఉన్న భావ స్వాతంత్రం కూడా ఈ రాజకీయ వారసుల చేత దోచేయబడుతుంది. ఉదాహరణకు ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షుడుగా భారత జాతీయ కాంగ్రెస్ దాశ్య శృంఖలాలను చేదిస్తూ  "తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ - ఆత్మాభిమాన సంరక్షణ" మూలవేరుగా చేసి నిర్మించిన "తెలుగుదేశం పార్టీ" గత 36 యేళ్లుగా అతిపెద్ద సంఖ్యలో కార్యకర్తలను కలిగి ఉండీ లేదా సభ్యత్వం పొంది ఉండి విలసిల్లుతూ వస్తుంది. అలాంటి రాజకీయ వ్యవస్థను తన కుమారునికి వారసత్వంగా అందించటానికి - ఏ మూలా సిద్ధాంతాలపై ఆ పార్తీ ఇంతవరకు విలసిల్లిందో వాటినే తృణీకరించి ఖండించి "పోత్తు" పేరుతో నారా చంద్రబాబు నాయుడు అభిజాత్యాహంకార కాంగ్రెస్ పాదాల చేంత అంటే ఒక "కుక్కమూతి పిందె" ని ఎన్టిఅర్ అన్న వ్యక్తి పాదాక్రాంతం చేస్తే బానిసలైన ప్రజలు ఉద్యమస్పూర్తిని తమలో రగుల్చుకోవటం లేదు.

kalaignar karunanidhi family photos కోసం చిత్ర ఫలితం

కేంద్ర నియంతృత్వం ఉంటే మరో ప్రజా ఉద్యమం నిర్మించి దాని ద్వారా ఎదుర్కోవాలి కాని, మూల సిద్ధాంతాలను మూలన పడేసి తన స్వార్ధం కోసం ఏకవ్యక్తి నిర్ణయం అయితే దాన్ని సంఘటితంగా ఎదుర్కోవాలి.   

chiranjeevi family photos కోసం చిత్ర ఫలితం

ఈ బానిసత్వానికి బహుమతిగా ఈ అధికార వారసులు ప్రజలకు  వారి పార్టీ కార్యకర్తలకు ముష్టిగా : *ఫ్రీ బీస్   *రిజర్వేషన్లు  *నెఱవేర్చలేని వాగ్ధానాలు  *వాటిపై ఐదేళ్లు పోచుకోలు కబుర్లు......ఇంకా ఎన్నెన్నో (మరో సందర్భంలో వివరిస్తా!) 

Lalu family politicians & Leaders కోసం చిత్ర ఫలితం

రాజ్యాంగ వ్యవస్థలపై - శాసనసభ, పార్లమెంట్, న్యాయవ్యవస్థ ఎక్జెక్యూటివ్ వ్యవస్థలపై- మితి మీరిన అధికార పార్టీ, ప్రభుత్వ, ప్రైవేట్ మీడియా దురహంకార ఆధిపత్యం. నిలుపుకోవటం కోసం ఆరాటం, దానికి పార్టీ, కుల, మత, కుటుంబ ప్రమేయ మీడియా మద్దతు - ఇవన్నీ కలసి ప్రజా స్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహస్యం చేయటం చూస్తూనే ఉన్నాం.

madhavarao sindhia family politicians కోసం చిత్ర ఫలితం

ఉదాహరణకు నారా చంద్రబాబు నాయుడు అనే రాష్ట్ర ముఖ్య మంత్రి పక్కా రాజకీయ ప్రయో జనాలు అనుభవిస్తూ, ఇంకా, ఇంకా ఆబగా అధికారం అనుభవించాలనే కాంక్షతో తన సామాజిక వర్గ మీడియా తోడ్పాటుతో డిల్లీ చేరి అక్కడ శరద్ పవార్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా లాంటి వారసత్వ వాద మితిమీరిన అధికార కాంక్షతో చెలరేగే నాయకులను కలిసి కేంద్రంలోని అప్రజాస్వామిక, నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేఖకూటమిని నిర్మించాలని తదేక దీక్షతో కోరుకునే వారసత్వ ఆశావహుడు.

nehru family tree with photos కోసం చిత్ర ఫలితం

తన కుమారుడు లోకెష్ నాయుడు కాంగ్రెస్ వారసుడు రాహుల్ గాంధి తరహాలో అధికారంలో తనజీవిత కాలంలో కొనసాగి తిరిగి అదేఅధికారాన్ని ఆయన కుమారుడు లేదా ఈయన వారసుదు దేవాన్ష్ నాయుడికి బదిలీ కావాలనే  ఆశయం ఉన్నవాడు. ఈ రాజ్యాంగం వారసత్వాన్ని కోరుకోదు ఎన్నికల్లో ప్రజల ఎంపిక ద్వారా ప్రజాప్రతి నిధులను నిర్ణయించే పరిస్థితి కలిపించింది. అలాంటి చోట అనేక తరాలుగా నాయకత్వాలు కొనసాగటానికి అడ్డదార్లు వెతికి కొనసాగటానికి బాబు లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఉండనే ఉన్నారు. అలాంటి వాళ్ళె రాహుల్ గాంధి, శరద్ పవార్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాలు.   

nehru family tree with photos కోసం చిత్ర ఫలితం

అధికారం. మితిమీరిన జోక్యంతో  స్వతంత్ర అధికారం ఉన్న వ్యవస్థలను ప్రభుత్వాలు స్వప్రయోజనాలకు వాడుకోవటం: ఉదాహరణకు కంప్ట్రొలర్ జనరల్ ఆఫ్ ఇండియా,  ఇంటెలిజెన్స్, సిబిఐ, ఈడి, ఎన్నికల సంఘం ఇలా అనేక వ్యవస్థలు వ్యక్తిగత నియంత్రణ గల సంస్థలు స్వతంత్రంగా పనిచెస్తేనే ప్రజాస్వామ్యరాజ్యం విలసిల్లుతుంది. అది జరగనప్పుడు ఏకవ్యక్తి నియంతృత్వం దాదాపుగా రాచరికపాలనే నడుస్తున్నట్లు చెప్పవచ్చు.  

jawarlal nehru family in politics కోసం చిత్ర ఫలితం

సాధారణంగా నైతికతను నిలువెత్తుగోతిలో పాతిపెట్టి సిగ్గుశరం అనే మానవ సహజ సద్గుణాలకు యువకులైతే తిలోదకాలు ఇచ్చే అవకాశాలున్నాయి. కారణం మితిమీరిన ఆత్మవిశ్వాసం, యువకులమన్న దూకుడు, దుందుడుకు స్వభావం అనుకోవచ్చు. దగ్గర దగ్గరగా డెబ్బైయేళ్ళ వయసు నాలుగు దశాబ్ధాల పరిపూర్ణ రాజకీయ జీవితం మారుమూల పల్లెటూరులో రెండెకరాలు, జోడెడ్ల వ్యవసాయ క్షెత్రస్థాయి నుండి దేశంలోనే అత్యంత అత్యధిక సంపద ఉన్న ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి చేరిన వ్యక్తిగా ఆయన ఎదిగారు.

shaik abdullah farooq abdullah Omar abdullah కోసం చిత్ర ఫలితం

తను అట్టడుగుస్థాయి నుంచి పైకివచ్చినా అతి నిరుపేదల దుస్థితి తనకు తెలిసినా, ఏవో కారణాలు చెపుతూ, అధికారం చేతిలో ఉంచుకొని, వెరెవరో అడ్డు పడుతున్నా రంటూ కేంద్రం నిధులివ్వట్లెదంటూ వారికి సహాయ సహకారాలు అందించటం మానేయటం ఆయనలోని రాజకీయ మధాందకార, అవకాశవాదానికి నిదర్శనం.

Jawaharlal nehru shaik addullah mohd ali jinnah కోసం చిత్ర ఫలితం

పెద్దగా కష్టపడకుండా వండివార్చి వడ్డనకు సిద్ధమైనట్లున్న రాజకీయాధికారం మామ నుంచి అరణంగా సంక్రమించింది. అంతకంటే సునాయాసంగా 45యేళ్ళ వయసు రాకముందే రాజకీయ కుతంత్రంతో "మామను వెనక నుండి రాజకీయంగా వేటేసి" ఆయన్ని క్రమంగా శంకరగిరి మాన్యాలు పట్టించక ముందే, సంపూర్ణ రాజకీయాధికారం చేజిక్కించుకున్న సామర్ధ్యం ఆయన స్వంతం.

 nehru family tree with photos కోసం చిత్ర ఫలితం  

మరింత సమాచారం తెలుసుకోండి: