కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పేరు ఒక ప్రభంజనం. ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి అడిగిన కెసిఆర్ జీవిత గమనం గురించి ఒక పుస్తకం రాయొచ్చు.తెలంగాణ ఉద్యమ సాధన ప్రక్రియలో చావు ను పలకరించి, గెలిచొచ్చినప్పడినుంచి నేటి వరకు కెసిఆర్ కు వారి కుటుంబానికి ఓటమి అనే పదమే భయపడుతోందా అనిపిస్తుంది పూర్వ ఎన్నికల ఫలితాలు చూస్తే.


ఆ పరిస్థితి మారబోతోందా?....అలానే కనిపిస్తోంది ఈ 2019 లోక్సభ ఎన్నికల సరళి చూస్తే. కెసిఆర్ బిడ్డ, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అయినా కవిత గారు, ప్రస్తుత ఫలితాల ప్రకారం ఎదురీదుతున్నారు. సమీప ప్రత్యర్థి ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అరవింద్, కవిత పై 25 వేళా ఓట్ల తో ముందంజలో ఉన్నారు.


సాక్షాత్తు కెసిఆర్ రంగం లోకి దిగి వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లి మరి చేసిన మంతనాలు కూడా ఫలించినట్లు కనబడట్లేదు. కధ ఇప్పుడే మొదలైంది, ఇంకా నాలుగు గంటల్లో ఫలితాల సరళి వెలువడనుంది. ఇండియా హెరాల్డ్ గ్రూప్ మీకు ఎలక్షన్ ఫలితాలను క్షణ- క్షణానికి అందిస్తూ ఉంటుంది.


ప్రస్తుత లీడ్:   వైసీపీ: 135 , టీడీపీ- 22 , NDA - 303 , UPA - 119


మరింత సమాచారం తెలుసుకోండి: