ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో ఉన్న నేతలనే బహు ప్రభావితం చేస్తున్నాయి. దిశా యాక్ట్ చట్టం మరియు అదే విధంగా రివర్స్ టెండరింగ్ తాజాగా మూడు రాజధానుల విషయం ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో మరియు జాతీయ మీడియాలో హైలెట్ వార్తలుగా పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చుని సంవత్సరం కాకముందే ఎప్పటినుండో రాజకీయాల్లో ఉన్న తల పండిపోయిన రాజకీయ నేతలకు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని ఇటీవల జాతీయ మీడియా జగన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. కేవలం తనకి మరియు ప్రజలకు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఉండేటట్లు జగన్ ఆలోచనలు చాలా బాగున్నాయి అని జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.

 

ఒక సమయంలో ముఖ్యమంత్రి కొడుకు గా ఉన్న జగన్ అనేక కష్టాలు పడ్డారు ఎక్కడ తలవంచలేదు మొండి ధైర్యంతో...తన తండ్రిని ఆదరించిన ప్రజల కోసం జైలుకు వెళ్లిన నడిరోడ్డుపై తన కుటుంబాని లాగిన ఎక్కడా కూడా బెదరకుండా తల వంచకుండా అనేకమైన ఆటుపోట్లను రాజకీయ పోరాటాలు ఎదుర్కొని భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని సాధించడం మామూలు విషయం కాదని తన కథనంలో తెలిపింది. అయితే తాజాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వైయస్ జగన్ తెరపైకి తీసుకురావడం జరిగింది.

 

దీంతో జగన్ గ్రాఫ్ అమాంతం గా ఒక్కసారిగా ప్రజలలో మరియు రాజకీయ నాయకులలో పెరిగిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలోనూ జాతీయ నాయకులకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా జగన్ రోజురోజుకీ పరిణితి చెందుతున్న నేపథ్యంలో...ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీపై కొద్దిగా దేశ స్థాయిలో నుండి వ్యతిరేకత రావటం స్టార్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్ దీంతో కేంద్ర హోంమంత్రి బిజెపి నాయకుడు అమిత్ షా దేశ రాజకీయ నేతలనే ప్రభావితం చేస్తున్నవైయస్ జగన్ నీ ఎన్డీఏ లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: