సమాజంలో జరిగే విషయాలపై మరియు అదే విధంగా రాజకీయ అంశాలపై స్టార్ ష‌ట్ల‌ర్ గుత్తా జ్వాల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలుపుతుంది. ఆటల్లోనే కాదు మాటల్లో కూడా గుత్తా జ్వాల తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. తన అందంతో బ్యాడ్మింటన్ కు ప్రత్యేక ఆకర్షణ గుత్తా జ్వాల తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా గత రెండేళ్లుగా ఆమె ఆటకు విరామం ఇచ్చి ఇటీవల కోచ్‌ గా సరికొత్త అవతారమెత్తింది.

 

తనకంటూ సొంత అకాడమీ స్థాపించి తీరిక లేకుండా ఆమె గడుపుతోంది. ఇటువంటి బిజీ షెడ్యూల్ ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం తో అవి హైలెట్ వార్తలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లో తాను పడిన ఇబ్బందులు ప్రస్తుతం యువతకు రానివ్వకూడదు అని భావించి కొత్త అకాడమీ స్టార్ట్ చేసినట్లు గుత్తా జ్వాల ఇటీవల చెప్పుకొచ్చారు.

 

బ్యాడ్మింటన్ ఎన్నుకున్న క్రీడాకారులకు భవిష్యత్తులో సరైన దిశానిర్దేశం అదేవిధంగా సదుపాయల కల్పనకు ఆధునిక సదుపాయాలతో తన అకాడమీ స్థాపించినటు గుత్తాజ్వాలా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలను సరిగా అర్థం చేసుకోలేక తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌భుత్వం నుంచి సాయం అందే వ‌ర‌కు ఎదురు చూడ‌డం భావ్యం కాద‌ని త‌న తండ్రి చెప్ప‌డంతో ఇంటిని అమ్మి అకాడ‌మీ ప్రారంభించిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. కాగా గుత్తా జ్వాల తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్ లు వక్రీకరించి కావాలని తప్పులు రాతలు రాయడంతో గుత్తా జ్వాల చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: