ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇక భారత్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. కరోనా భారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చిన కొత్తలోనే ఆరోగ్య సేతు అనే ఒక యాప్ ను రూపొందించి ప్రజలలోకి ప్రభుత్వం వెళ్లేలా చేసింది. ఇప్పటికీ అనేక ప్రభుత్వ కార్యాలయాలలో ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ రోజురోజుకి బలపడుతుంది. ఎన్ని పరీక్షలు నిర్వహించిన దాగుడుమూత ఆడుతుంది. ఎంతోమందికి పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్ రావడం, తర్వాత చనిపోయాక పాజిటివ్ రావడం అనేక సందర్భాలలో చూశాం. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వం హితం అనే యాప్ ను రూపొందించి ప్రజలలోకి విడుదల చేయనున్నారు.
కరోనా పరీక్షలు పెరిగే కొద్దీ బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీనితో పాటు సమస్యలు, ఫిర్యాదులు కూడా పెరగనున్నాయి. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న బాధితుల కోసం తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. దీనికి హితం (హోం ఐసోలేషన్ ట్రీట్‌మెంట్ అండ్ మానిటరింగ్) అని పేరు పెట్టింది. దీన్ని ప్రయోగాత్మకం పరిశీలిస్తున్నారు. లోపాలను సరిచేసిన తర్వాత బాధితులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
హోంఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు తమ ఫోన్లో ‘హితం’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో నమోదు చేసిన సమాచారం మొత్తం వైద్యశాఖకు చేరుతుంది. పది రోజులపాటు రోజుకు రెండు సార్ల చొప్పున డాక్టర్లు బాధితులతో మాట్లాడతారు. తర్వాత కూడా ఏడు రోజులపాటు బాధితులు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే యాప్ ద్వారా డాక్టర్లను సంప్రదించొచ్చు.
హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు లక్షణాలు బయటికి కనిపించినట్లయితే డాక్టర్లు సలహాలు ఇస్తారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని భావిస్తే ఈ యాప్ ద్వారానే 108కి కాల్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఒకే సమయంలో పదివేల మందికి పైగా ఆన్ లైన్ లో సేవలందించే విధంగా ఈ యాప్‌ను రూపొందించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి