2014లో పీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రధాని మోదీ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. నోట్లరద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు లాంటి కీలక నిర్ణయాలను మోదీ తీసుకున్నా ఆయనకు ప్రజలనుంచి మద్దతు లభించింది. మంచి విజన్ ఉన్న నాయకుడిగా మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారు. మోదీ సుపరిపాలన వల్ల 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీ సునాయాసంగా అధికారంలోకి రాగలిగింది. 
 
అయితే ప్రస్తుతం మోదీని, బీజేపీ భవిష్యత్తును చైనా తేల్చబోతుంది. జాతీయవాదం, జాతీయభావం బీజేపీ పెట్టుబడులు. ఈ స్పూర్తి మోదీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. గత ఆరేళ్లలో చోటు కీలక పరిణామాలు చోటు చేసుకున్న ప్రతిసారి మోదీ స్ట్రాంగ్ పర్సన్ గా ప్రూవ్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలు మోదీని హీరోగానే భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చైనా మోదీని దెబ్బకొట్టాలని చెబుతోంది.               
 
మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై దృష్టి పెట్టక ముందు చైనా కార్యకలాపాలన్నీ సులభంగా సాగేవి. అయితే మోదీ పీవోకేపై దృష్టి పెట్టడంతో చైనా ఆందోళనకు గురవుతోంది. మోదీ పీవోకేను ఆక్రమిస్తే అక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టిన చైనా తీవ్రంగా నష్టపోతుంది. గాల్వన్ లోయ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ చైనాపై ఘన విజయం సాధించింది. అయితే పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తోంది. 
 
మోదీ మాత్రం చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చైనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టారు. ఒక్కసారి భారత్ ను ఓడించి భూభాగాన్ని ఆక్రమిస్తే మోదీ ప్రభను తగ్గించవచ్చని చైనా భావిస్తోంది. మోదీ ముందు చైనా ఉంచిన సవాల్ చిన్నదేం కాదు. అయితే మోదీ ఈ సవాల్ ను ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: