ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం సామాన్య ప్రజలే కాదు అధికారులు ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం మరింత ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. అయితే కరోనా  వైరస్ నియంత్రణకు  జగన్ సర్కారు కీలక ముందడుగు వేస్తు ఎన్నో  చర్యలు తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది

 

 అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వైస్సార్సీపీ  కి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా  బారినపడి ఆసుపత్రి పాలయ్యారు.ఇక ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పార్లమెంటు సభ్యులు ఆయన విజయసాయిరెడ్డి కరోనా  వైరస్ బారిన పడ్డారు. విజయసాయి రెడ్డి కరోనా వైరస్ బారిన పడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత చర్చనీయాంశంగా మారింది. 

 


 ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా కరోనా  బారిన పడుతుండగా తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనాపాజిటివ్ అని తేలింది . అయితే  గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విజయసాయిరెడ్డి కరోనా నిర్ధారిత పరీక్షలు చేసుకోగా  పాసిటివ్  అని తేలింది. పార్లమెంటరీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డితో పాటు ఆయన పీఏ కి  కూడా కరోనా  వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఇద్దరు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని దృశ్య  పది రోజుల పాటు... అందుబాటులో ఉండను  అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: