చాలామంది తెలుగువారు అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తూ ఉంటారు. అలాంటి వారికి అధికార పార్టీ నాయకుడు మైక్ లీ పిడుగులాంటి వార్త చెప్పారు. అమెరికా లో స్థిరపడిన ఇతర దేశాలకు  వాళ్ళు రాబోయే రోజుల్లో గ్రీన్ కార్డు పొందాలంటే ఇంకా 195 ఏళ్ళు పడుతుందని పేర్కొన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీకి చెందిన మైక్ లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి ఆందోళనకరంగా మారింది. మరోపక్క డెమోక్రాటిక్ లు… రిపబ్లికన్ పార్టీ చేసిన ఈ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికాలో ఇతర దేశాలకు చెంది స్థిరపడిన వారిని ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నరు.
 
 డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికాలో గ్రీన్ కార్డు సులభతరం అవటానికి అన్ని విధాలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ లో కీలకమైన వాళ్లు ఇతర దేశాలకు చెందిన వారే అని, వారి సేవల వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ లీ వ్యాఖ్యలతో అమెరికాలో స్థిరపడిన ఇతర దేశాలకు చెందిన వాళ్లు… గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసిన వాళ్ళు ముఖ్యంగా భారతీయులు భారీ స్థాయిలో ఉండటంతో ఆందోళనలో పడిపోయారు.
 
 గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతి వలస దారుడు ప్రస్తుత పరిస్థితిలో ఇంకా చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అంటూ ట్రంప్ నాయకత్వం లో పని చేసే నాయకులు అంటున్న నేపథ్యంలో అమెరికాలో ఎక్కువగా భారతీయులకు అందులోనూ తెలుగువాళ్లకు ఈ వ్యాఖ్యలు భవిష్యత్ పై  నీలినీడలు కమ్మేసి నట్లయింది. మరోపక్క అమెరికా వెళ్దామని భావిస్తున్నా ఇక్కడ ఉన్న తెలుగువారు కూడా ఇంకా అటువంటి ఆలోచన నుండి విరమించుకోవాలని డిసైడ్ అవుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల టైంలో “అమెరికా గ్రేట్ ఎగైన్” అనే స్లోగన్ తో ప్రచారం చేసిన ట్రంప్… ఈసారి ఎన్నికల ప్రచారంలో “అమెరికన్లకే ఉద్యోగాలు” అనే సరి కొత్త స్ట్రాటజీ తో ట్రంప్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: