ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఊహించని ఆరోపణలు చేశారు. ముందుగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎవరు భయపడవద్దని ప్రకటనలు చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్ పై మీ అభిప్రాయం ఏంటి అంటూ ధర్మపురి అరవింద్ ని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నూటికి నూరు శాతం భయాందోళనలో ఉన్నారు. కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని పేర్కొన్నారు. 
 
కేసీఆర్ మీడియా ముందు మాట్లాడిన మాటలు ఒకలా ఉంటే.. ఆసుపత్రిలో వసతులు మరోలా ఉన్నాయని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో కరోనా ని  కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయటం లేదని, ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అంతే కాకుండా తన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందాల్సిన 250 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు కి తరలించారని, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారని ఊహించని ఆరోపణలు అరవింద్ చేశారు. 
 
దానికి నిజామాబాద్ జిల్లా మంత్రులు మరియు అధికారులు కూడా సహకరించాలని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ సర్కార్ ఎప్పుడు పడిపోతుందో అని ఎదురు చూస్తున్నారు అంటూ పేర్కొన్నారు. పూర్తిగా కరోనా ని కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైనట్లు ప్రజలే బయట విమర్శలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. కరోనా టైం లో సీఎం కార్పోరేటర్లని కొంటున్నాడు అని మండిపడ్డారు. అదే రీతిలో మంత్రి కేటీఆర్ మైనింగ్ అవినీతికి పాల్పడుతున్నారని త్వరలో  ఆ విషయాలను బిజెపి బయటపెడుతుంది అంటూ చెప్పుకొచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: