విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందంటే చాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల్లో ఒకటే ఆందోళన.. అదే ఆదాయ ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలి.. దీని కోసం తరగతులు వదిలేసి.. ఆఫీసుల చుట్టూ తిరగాలి. పోనీ.. ఒక్కసారి సర్టిఫికెట్ తెచ్చుకుంటే సరిపోతుందా.. లేదు. ప్రతి ఏటా కొత్త సర్టిఫికెట్ కావాల్సిందే.. 

 

 

మరి ఎందుకు  ఈ నిబంధన..? ఆదాయం అన్నది ఏటా మారుతుంది అన్న కాన్సెప్టే ఇందుకు కారణం.. కానీ వాస్తవంగా అలా జరుగుతుందా.. ఓ పేదోడి జీవితం ఏడాదిలో మారుతుందా.. నూటికి 99 శాతం మందిలో మారదు. కానీ వీళ్ల బిడ్డలంతా ఏటా ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం నానా ఇబ్బందులు పడాలి. అదే కులధ్రువీకరణ పత్రం అయితే ఒక్కసారి తీసుకుంటేచాలు. 

 

IHG


ఇక ఇప్పుడు ఈ కష్టాలు బడుగు విద్యార్థులకు తొలిగిపోయాయి. ఇకపై బియ్యం కార్డులనే  ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని  ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. బిపీఎల్ కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులనే ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలంటూ  ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు,ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

 

 


ఇకపై వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హత కోసం రైస్ కార్డులనే ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని.. రెవెన్యూశాఖ తన ఉత్తర్వులు పేర్కొంది. అంతే కాదు..దారిద్ర్యరేఖకు ఎగువన ఉండే కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఇతరులకు జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా నాలుగు ఏళ్ళ పాటు చెల్లుబాటులో ఉంటుంది. రైతులకు... రుణ మంజూరులో బియ్యం కార్డులనే గుర్తించాలని బ్యాంకులకు  ఏపీ సర్కారు సూచించింది. మనసున్న ప్రభుత్వం అంటే ఇదే కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: