కేంద్ర ప్ర‌భుత్వం విష‌యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  వైఖ‌రి మ‌రోమారు స్ప‌స్ట‌మైంది. త‌మ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో మ‌రోమారు కేసీఆర్ తేల్చి చెప్పారు. వివాదాస్ప‌ద అంశాల విష‌యంలో ఎలా స్పందిస్తామో పేర్కొంటూనే...సరైన స‌మ‌యాల్లో త‌మ వైఖ‌రిని సైతం ఆయ‌న వివ‌రించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వైఖరిని సీఎం కేసీఆర్‌ తప్పు పట్టిన సంగ‌తి తెలిసిందే. నీటి ప్రాజెక్టుల విష‌యంలో త‌న రాష్ట్ర అధికారుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో రాష్ర్టానికి ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పా రు. తెలంగాణ ఏర్పడేనాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చుకూడా జరిగిన ప్రాజెక్టుల విషయం లో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏ మాత్రం సరికాదని కేంద్రానికి తేల్చిచెప్పారు. అయితే, తాజాగా ఇంకో విష‌యంలో మాత్రం కేంద్రానికి సూచ‌న చేశారు.



నీటి ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం వైఖ‌రిపై కేసీఆర్ మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేవిషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతోం ది. వాస్తవానికి సాగర్‌ నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నిండాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్‌ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి.  రాష్ర్టా ల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్రవైఖరిని కూడా యావత్‌దేశానికి తెలిసేలా చేస్తాం’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.


ఈ స‌మావేశం జ‌రిగిన మ‌రుస‌టి రోజైన మంగ‌ళ‌వారం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సీఎం  కేసీఆర్ అన్నారు. కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి సూచించారు. ‘‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక చేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు. కాగా, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో త‌మ వైఖ‌రిని మ‌రోమారు కేసీఆర్ స్ప‌ష్టం చేశారని అదే స‌మ‌యంలో దేశం కోసం కూడా విలువైన సూచ‌న చేశార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: