గత కొంతకాలం నుండి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు బద్ధ శత్రువుగా మారాడు. వింత వింత నిర్ణయాలతో తన దేశ సైనికులను ఎప్పుడూ అన్నింటికీ సంసిద్ధముగా ఉండేలా చేస్తుంటాడు. ఈమధ్యన కిమ్ చనిపోయాడన్న వార్తలు కూడా నెట్టింట్లో హల్చల్ చేసిన విషయం మీకు తెలిసినదే. అయితే కిమ్ ఇప్పుడు తన పక్క దేశమైన దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను వీక్షించండి.  

ప్రపంచంలో హిట్లర్ తర్వాత నియంతగా పిలువబడుతున్న కిమ్ ఉత్తర కొరియాకు అధ్యక్షుడిగా ఉన్నాడు. కనీసం ఎవరిపైనా జాలి కూడా చూపని కిమ్ ఇప్పుడు ఒక దేశానికి క్షమాపణలు చెప్పడం సంచలనంగా మారింది. అది కూడా కలలో కూడా బద్దశత్రువుగా భావించే దక్షిణ కొరియాకు మరియు దక్షిణ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు.  ఈ విషయాన్ని సియోల్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల దక్షిణ కొరియా నేవి అధికారిని ఉత్తర కొరియా సైన్యం కాల్చి చంపింది.  కొరియా యుద్ధం తరువాత దక్షిణ కొరియా అధికారిని ఇలా కాల్చి చంపడం ఇదే మొదటిసారి.  దక్షిణ కొరియా అధికారి ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించడంతో ఇలా చంపినట్టు అధికారులు పేర్కొన్నారు.  కరోనా భయంతోనే ఉత్తర కొరియా ఇలా చేసినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియా అధికారిని కాల్చి చంపడంపై సీరియస్ అయిన సియోల్ అధికారులు, వివరణ కోరారు.  దీనిపై నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణలు చెప్పారని అధికారులు ప్రకటించారు. దీనితో ఈ విషయం ముగిసిపోయిందని అంతా అనుకుంటున్నారు అయితే, కొంత సమాచారం ప్రకారం దక్షిణ కొరియా దీనికి ప్రతీకారం తీర్చుకొనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది.  మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: