ఆంధప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై రగడ జరుగుతూనే ఉంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి,రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేల ప్రస్తుత పరిస్థితి నెలకొంది. ఏపీలో స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితిలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఏమాత్రం సిద్దంగా లేమని,ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. 

తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దమౌతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్ర బాబు తొత్తులా వ్యవహరిస్తున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. 

ఆదివారం నాడు గుడివాడలోని కే కన్వేన్షన్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాడుగు పోటీల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎస్ఈసీ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కరోనా తో రాష్ట్రం అల్లాడుతున్న ఈ  విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం ఒక దుర్మార్గపు చర్య అన్నారు. ప్రస్తుతం  దేశంలో కరోనా తో పాటుగా,కరోనా స్ట్రెయిన్ కూడా విస్తరిస్తుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని ఆయన అన్నారు. దీంతో ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: