ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ షాపులు బిజిబిజీగా మారిపోతాయి. ఇక కోడిగుడ్లకైతే.. వారంలో అన్ని రోజులూ హాట్ డేసే. మీరు ఎంతగా చికెన్, ఎగ్ ప్రియులు అయినా.. ఓ వారం పది రోజులపాటు వాటి ముఖమే చూడకండి. 

ఇదేదో పూజల గురించో.. వ్రతాల గురించో చెబుతున్న మాట కాదు.. మీ ఆరోగ్యంపై ప్రేమతో చెబుతున్న హిత వాక్యం. అవును మరి హైదరాబాద్ పరిసరాల్లో కోళ్లఫారాలకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది మరి. ఈ విషయం నిర్థారణ కూడా అయ్యింది. 

హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ తొర్రూరులో దాదాపు 20 వేల వరకూ కోళ్లు ఈ బర్డ్ ఫ్లూతో చనిపోయాయట. అనుమానంతో వాటి శాంపిళ్లను పూణె
పంపిన వారికి షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆ కోళ్లన్నీ బర్డ్ ఫ్లూతోనే చనిపోయాయట. 

విషయం తెలియగానే రంగంలోకి దిగిన అధికారులు.. హయత్ నగర్ కు పది కిలోమీటర్ల పరిధిలోని కోళ్లఫారాలో ఉన్న దాదాపు 2 లక్షల కోళ్లను చంపి పూడ్చివేయాలని నిర్ణయించారు. అంతే కాదు.. ముందు జాగ్రత్తగా హయత్ నగర పరిసరప్రాంత ప్రజలు ఓ వారం పదిరోజుల వరకూ కోడి, గుడ్డు జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: