బొత్స సత్యనారాయణ....ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన బొత్స, ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు విజయనగరం జిల్లాపై ఎంత పట్టు ఉందో చెప్పాల్సిన పని లేదు. జిల్లాలో ఈయన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా సరే బొత్స చీపురుపల్లిలో భారీగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు.


అయితే ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేసి బొత్స తిరుగులేని బలం తెచ్చుకున్నారు. ఇక బొత్స ఏది చెబితే విజయనగరం జిల్లాలో జరగాల్సిందే అని విధంగా రాజకీయం ఉంటుంది. అయితే ఇలా బొత్స ఆధిపత్యం జిల్లాలో బాగా ఉంటుంది. ఇక బొత్స ఆధిపత్యానికి గండికొట్టే ఏ నాయకుడు విజయనగరం జిల్లాలో లేరనే చెప్పొచ్చు. అయితే ఓ ఇద్దరు సీనియర్లు మాత్రం బొత్స ఆధిపత్యానికి గండికొట్టడానికి చూస్తున్నారని తెలుస్తోంది.


అందులో ముఖ్యంగా సాలూరు ఎమ్మెల్యే పీడికల రాజన్న దొర, బొత్స డామినేషన్ తగ్గించడానికి చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే మూడుసార్లు వరుసగా గెలిచిన రాజన్న దొరకు జగన్ కేబినెట్‌లో బెర్త్ దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణ, రాజన్నకు పదవి రాకుండా అడ్డుకున్నారని టాక్. గిరిజన మంత్రిగా జూనియర్ అయిన పుష్పశ్రీవాణికి దక్కేలా చేశారని ప్రచారం ఉంది.


అటు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు పదవి దక్కలేదు. అయితే ఈ సారి మాత్రం వీరిలో ఒక్కరికి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ విస్తరణలో పదవి రాజన్నకు గానీ, వీరభద్రస్వామికి గానీ ఛాన్స్ రావొచ్చని తెలుస్తోంది. ఇక వీరిలో ఎవరికి పదవి వచ్చిన బొత్స ఆధిపత్యానికి చెక్ పడుతుందని అంటున్నారు. మరి చూడాలి విజయనగరం జిల్లాలో బొత్స ఆధిపత్యానికి గండికొట్టే నాయకుడు ఎవరో?


మరింత సమాచారం తెలుసుకోండి: