
అలాగే... ఈ ఫిర్యాదు తో పాటు కీలక ఆధారాలు సమర్పించారు వైసీపీ ఎంపీలు. నర్సాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు, ఓ ప్రముఖ ఛానెల్ అధినేత మధ్య లక్ష యూరో ల హవాలా లావాదేవీలు జరిగాయని కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ కు వివరించారు. ఈ లావాదేవీలకు సంబంధించి సిఐడి వద్ద కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయని... ఏకంగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నివేదికలో వెల్లడైందని ఎంపీలు వివరించారు. రఘురామకృష్ణంరాజు , ప్రముఖ ఛానెల్ అధినేత పైన అక్రమ నగదు చలామణి చట్టం , “ఫెమా” కింద కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
అంతేకాదు... దేశం విడిచి పారి పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని... వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వారు కోరారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని వైసీపీ ఎంపీలు కోరారు. అలాగే.. పోలవరం, ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఈ సందర్భంగా చర్చించారు వైసీపీ ఎంపీలు. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,656 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని ఓ లేఖ సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తక్షణమే రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరిన వారు.... 2013 భూసేకరణ చట్టం ఆధారంగా సహాయ, పునరావాస ప్యాకేజీ ని అమలు చేయాలన్నారు. 2022 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు.