ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ ఓపెన్ చేయడం కూడా ప్రధాన సమస్యగా మారింది. స్కూల్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ గా ఉన్నా సరే కేసులు క్రమంగా పెరగడంతో ఇబ్బందులు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అయినా సరే ఉపయోగం కనపడటం లేదు. ఇక కరోనా కేసుల విషయంలో విద్యార్ధుల తల్లి తండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది పిల్లలు స్కూల్ కి రావడం లేదు.

ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ లో కేసులు క్రమంగా పెరగడం సమస్య అయింది. అటు టీచర్లకు కూడా కరోనా పెద్ద సమస్యగా మారింది అనే చెప్పాలి. పలువురు టీచర్లు కూడా స్కూల్ కి రావడం లేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటె జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో  156 చేరిన కరోనా కేసులు.. తల్లి తండ్రులను మరింతగా భయపెడుతున్నాయి. ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వారిలో నలుగురు ఉపాద్యాయులు, 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

మద్దిపాడు మండలం నేలటూరు యంపీయూపీ స్కూల్ లో నలుగురికి కరోనా వచ్చింది. ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో నలుగురికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కొండపి మండలం పెట్లూరు జెడ్పీ హైస్కూల్ లో ముగ్గురికి కరోనా సోకింది. పొన్నలూరు మండలం పి.అగ్రహారం  స్కూల్ లో నలుగురికి, విప్పగుంట ఎంపీపీఎస్ లో ఒకరికి వచ్చిందని కనిగిరి మొదటి వార్డు ఎంపీ స్కూల్ లో ఇద్దరికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం స్కూల్, హెచ్.నిడమానూరు ఎయిడెడ్ స్కూల్ లో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: