దేశంలో పలుచోట్ల ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీనిలో పశ్చిమబెంగాల్ కూడా ఒకటి. అక్కడ దీదీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఆమె గత ఎన్నికలలో ఓడిపోవటం, మళ్ళీ వీలైనంత త్వరగా ఎన్నికలలో పాల్గొని గెలిచినప్పుడే సీఎం పదవి రానుందనే అత్యవసర పరిస్థితి ఆమెది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఈ ఎన్నికలలో గెలిచి చూపింది. ఇంక ఆమె సీఎం పదవికి లోటు ఉండబోదు. అయితే ఆమె గెలవకుండా ఉండేందుకు బీజేపీ ఆమెకు నమ్మకస్తుడైన నేతలు తన వైపు తిప్పుకుంది. అంటే నయానో భయానో ఆయన బీజేపీలో చేరాడు. అంతటా బీజేపీ వ్యూహాన్ని గ్రహిచిన దీదీ మరో ఉపఎన్నిక కోసం ఎదురుచూసింది. అది రానే వచ్చింది. అందులో గెలిచి తానేంటో బీజేపీకి చూపింది.

ఇక బీజేపీకి ఉన్న అధికార దాహంతో పశ్చిమబెంగాల్ ను స్వాధీన పరుచుకోవాలని చూసినా ఆమె ధైర్యం కోల్పోకుండా పోరాడి గెలిచింది. బీజేపీ మాత్రం తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టు, తాజా దేశవ్యాప్త ఉపఎన్నికలలో ఎక్కడ కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. బీజేపీ అంటేనే విభజించి, పాలించు  అనే నీతిసూత్రాన్ని కఠినంగా అమలు చేసే ఘోరమైన పార్టీ. అలాంటి పార్టీ పశ్చిమబెంగాల్ లో కూడా తన జండా ఎగురవేయాలని చూసింది. దానికి పెద్ద ప్రణాళిక రచించింది. ముందు ఆమె పక్కన ఉన్న బలమైన నమ్మకస్తులను తనవైపు తిప్పుకుంది. దీనితో ఆమె మానసికంగా దెబ్బతింటే, ఓడించడం తేలిక అనుకున్నారు. కానీ మమతా తన ధైర్యాన్ని కోల్పోకుండా బీజేపీతో ఒంటిచేత్తో యుద్ధం చేసి గెలిచింది.

ఇలా బీజేపీ నీచరాజకీయాలు చెప్పాలంటే కర్ణాటకలో చేసింది ఒక్కటి మచ్చుకు చెప్పుకుంటే సరిపోతుంది. అయినా తనవైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. అధికారం కోసం ఆ పార్టీ చేయని పని లేదు. రోజురోజుకు ఆపార్టీ నేతలు దిగజారుతూనే ఉన్నారు. ఒకప్పటి ఆ పార్టీ నేత వాజపేయి ఎక్కడ విలువలు లేని వీళ్లు ఎక్కడ! ఇంత వ్యతిరేకత ఉన్న కూడా తమకు ప్రజలలో అభిమానం తగ్గలేదు అనేది నిరూపించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా మోడీ అమెరికా టూర్ లో కూడా మోడీ ప్లేన్ లో కూడా ఎంతో  శ్రమపడుతున్నట్టు ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారం తప్ప వాళ్ళు ఉన్నంత కాలంగా ఏవేవి అభివృద్ధి చేశారో చెప్పమంటే మాత్రం మాట తెలివిగా దాటేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: