గుంటూరు జిల్లాలో రాజ‌కీయ నేత‌ల‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఎవ‌రైనా వ‌రుస‌గా ఐదు సార్లు గెలిస్తే.. ఆరోసారి గెలుపుకు దూర‌మ‌వుతారు. కోడెల శివ ప్ర‌సాద్ రావు, మాకినేని పెద ర‌త్త‌య్య‌, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి ఉద్దండులు  అయిన నేత‌లు వ‌రుస‌గా ఆ జిల్లాలో ఓట‌మి లేకుండా ఐదు సార్లు గెలిచారు. వీరు ఖ‌చ్చితంగా ఆరో సారి గెలిచి హ్యాట్రిక్ కొడ‌తారు అనుకుంటోన్న టైంలో ఆరో ప్ర‌య‌త్నంలో ఓడిపోయారు. ఇలా ఈ జిల్లాలో ఆరో సారి వ‌రుస గెలుపు అనేది ఏ రాజ‌కీయ నేత‌కు లేదు. అక్క‌డ అదో బ్యాడ్ సెంటిమెంట్ అయ్యింది.

ఇప్పుడు నెల్లూరు జిల్లా స‌ర్వే ప‌ల్లి లోనూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వైసీపీ ఎమ్మెల్యేకు టెన్ష‌న్ ప‌ట్టిస్తోంది. హ్యాట్రిక్ గెలుపు అనేది అక్క‌డ నేత‌ల‌కు లేదు. ఇక్కడ అది ఓ బ్యాడ్ సెంటిమెంట్ అయ్యింది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ సెంటిమెంట్ మీదే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ని సెంటిమెంట్ వెంటాడుతుంద‌నే అంటున్నారు. ఇక్క‌డ నుంచి టీడీపీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ రెండు సార్లు విజయం సాధించారు.

1994, 1999లో గెలిచిన ఆయ‌న మూడో సారి గెల‌వ‌లేదు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు అస‌లు గెలుపు అన్న‌దే లేదు.  2004, 2009 వరస ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వరస విజయాలు సాధించినా.. 2014లో ఆయ‌న‌కు ఇక్క‌డ టిక్కెట్ రాలేదు. అయితే ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇక వైసీపీ ఆవిర్భవించిన తర్వాత సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు. 2014, 2019 లో వ‌రుస‌గా గెలిచిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల లో గెలిచి హ్యాట్రిక్ కొడ‌తారా ?  లేదా ఈ ని యోజ‌క వ‌ర్గం లో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్‌కు బ‌ల‌వుతారా ? అన్న చ‌ర్చ న‌డుస్తోంది. అందుకే ఇప్పుడు కాకాణిలో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: