పుల్వామా లో ఉగ్ర దాడి ఘటన తరువాత భారత వైమానిక వింగ్ కమాండర్ అబినందన్ చూపిన ధైర్య సాహసాలకు భారత ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది . ప్రస్తుతం వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న అభినందన్ కు గ్రూప్ కెప్టెన్ గా పదోన్నతి ఇచ్చి గౌరవించింది. ఈ గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది భారత సైనిక దళం లోని కల్నల్ ర్యాంక్ కి సరి సమానం. 2019 ఫిబ్రవరి 14  పుల్వామా ఉగ్రదాడి ఘటన లో దాదాపుగా 40 మంది వీర జవాన్లు తమ ప్రాణలు కోల్పోయారు . 2019 ఫిబ్రవరి 27 వ తారీఖున పాకిస్తాన్ బలగాలు ఎఫ్-16 యుద్ధ విమానంతో భరత్ లో మల్లి దాడులు జరిగాయి ..

IHGఈ సమయంలో భారత వైమానిక కమాండర్ అభినందన వర్ధమాన్ మిగ్-21 విమానంలో పాకిస్తాన్ బలగాలను వెంటాడి ఎఫ్-16  ను  నెల కూల్చాడు. ఈ సందర్భంలోనే మిగ్-21 విమానం పూర్తిగా ధ్వంసం అవ్వడంతో పారాషూట్ సహాయంతో కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు ఇదే సమయంలో అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కి పలు చిత్రహింసలకు గురిఅయ్యాడు. భరత్ వింగ్ కమాండర్ అభినందన్ ని అప్పగించవలసిందిగా పాకిస్తాన్ ని కోరగా  పాకిస్తాన్ పై ఇతర దేశాలనుండి గట్టి ఒత్తిడి పెరగడంతో  చేసేదేమిలేక చచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం అభినందను వాఘా ప్రాంతం వద్ద అభినందన్ ను అప్పగించింది . 


IHG
ఈ ఘటనలో అభినందన్ ను పాకిస్తాన్ సైన్యం ఎంత చిత్రహింసలు పెట్టినప్పటికీ భారత సైన్యం రహస్యాలను బయట పెట్టలేదు. ఈ ఘటన తరువాత ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నతరువాత మళ్లీ తన టీమ్ లో చేరి భారత కి సేవలందిస్తూవున్నాడు. 2019 లోనే అభినందన్ కి వీరచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఈ పదోన్నతి తో అభినందన్ ఇంకెన్ని సాహసాలు చేయబోతున్నాడో అని భరత్ ఎదురుచూస్తూఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: