ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న పాలను నాశనం చేసి తాలిబన్లు అరాచకాలు సృష్టించి ఆఫ్ఘనిస్తాన్ నూ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత షేరియా చట్టాలను అమలు లోకి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం తాలిబన్ల పాలన చేపట్టిన నాటి నుంచి అటు ఆఫ్ఘనిస్థాన్లో ఆహార సంక్షోభం ఆర్థిక సంక్షోభం పెరిగిపోతుంది. తాలిబన్ల పాలన మొదలుపెట్టిన నాటి నుంచి అన్ని దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్న సత్సంబంధాలను తెంచుకున్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి.


 ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన పలు దేశాలు తాము తాలిబాన్ల ప్రభుత్వానికి వ్యతిరేకం అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు తీవ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్ మాత్రం తాలిబన్లకు మద్దతు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో అంతర్జాతీయ సమాజం తాలిబన్ల ప్రభుత్వాన్ని  ఎలా చూడబడుతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అటు తాలిబన్లు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఇటీవలే తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. తాము భారత్ సహా ఏ దేశంలోనూ విరోధం కోరుకోవడం లేదు అంటూ తాలిబన్ విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా  భారత్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలను దూరం పెడుతున్నారు అన్న వార్తలను తోసిపుచ్చారు తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్. మహిళలు ప్రస్తుతం వైద్య రంగంలో 100 శాతం పనిచేస్తున్నారని విద్యారంగం సహా అన్ని రంగాల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: