తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడు కొంతమంది పార్టీ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా లేకపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రజల్లోకి వెళ్లకపోవడం అదే విధంగా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కాస్త దూకుడుగా ముందుకు వెళ్లక పోవడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశంగా అర్థమవుతుంది. పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

అయితే కొంతమంది సీనియర్ నాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బ గట్టిగా తగిలింది అని ప్రచారం జరుగుతోంది. పార్టీ విషయంలో గట్టిగా మాట్లాడే సీనియర్ నాయకులు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దూకుడు రాజకీయం చేస్తున్నారని పార్టీలో ఉన్న కొంతమంది కీలక కార్యకర్తలు తమ వైపు తిప్పుకునే విధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అధిష్టానం రాజకీయం చేస్తోందని అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గట్టిగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారి విషయంలో ఇదే జరిగింది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గారు కాస్త సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.

పార్టీలో అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన సదరు సీనియర్ నేత ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పట్ల టీడీపీ అధిష్టానం కూడా కాస్త సీరియస్  గా ఉంది. రాజకీయంగా పార్టీకి కాస్త గడ్డు పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో సదరు నాయకుడు మాట్లాడకపోతే జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నా సరే ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు అని పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో బయటకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా కాస్త నియోజకవర్గంలో జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారని ప్రచారం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: