హైద‌రాబాద్ లో ప్ర‌తి యేడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఎంత ఆర్భాటంగా జ‌రుగుతాయో తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే న్యూ ఇయ‌ర్ వేడుకల‌కు అప్పుడే రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈ సారి న్యూ ఇయ‌ర్ పార్టీల్లో ఎక్కువుగా డ్ర‌గ్స్ కూడా వినియోగిస్తార‌న్న సందేహాలు ముందు నుంచే ఉన్నాయి. సిటీలో న్యూ ఇయ‌ర్ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడే క‌ల్చ‌ర్ ఇటీవ‌ల బాగా పెరుగుతోంది. అది ఈ సంవ‌త్స‌రం మ‌రింత ఎక్కువ కానుంది.

మ‌రో వైపు చాపకింద నీరులా డ్రగ్స్ విక్రయాలు జ‌రుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అక్రమంగా డ్రగ్స్ కలిగిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే పట్టుబడిన వారిలో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఉన్నారు. ఇక యువ‌కులు ఎక్కువుగా గోవా నుంచి డ్ర‌గ్స్ తీసుకు వ‌చ్చి హైద‌రాబాద్ లో అమ్ముతున్నారు. పోలీసులు ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద త‌నిఖీల్లో డ్ర‌గ్స్ క‌లిగి ఉన్న సిద్దిక్, అఖిల్, రమ్య లను అదుపులో కి తీసుకున్నారు. వీరిలో ర‌మ్య ప్ర‌ముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్నారు.

వీరి వద్దనుండి 2 గ్రాముల గాంజా తో పాటు మేధాంఫెటిన్, ఎండి ఎం ఎ, ఎల్ ఎస్ డి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు చెప్పారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో డ్ర‌గ్స్ వాడేందుకు గోవా నుంచి వీటిని తీసుకు వ‌స్తున్న‌ట్టు వారు చెప్పారు. ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా ముగ్గురికీ పరిచయం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత గచ్చిబౌలిలోని ఓ పబ్ లో తరచు ముగ్గురు పార్టీలకు హాజ‌రు అయ్యే వారు. అలా అఖిల్ కు త‌ర‌చూ గోవా వెళ్లే డ్రగ్ పెడ్లర్ల తో  సంబంధాలు ఏర్ప‌డిన‌ట్టు పోలీసుల విచార‌ణ లో తేలింది. ఏదేమైనా హైద‌రాబాద్ యువ‌త డ్ర‌గ్స్ మ‌త్తులో చిక్కు కోవ‌డం ఆందోళ‌న క‌రం అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: