ఎదుగుతున్న వాడిని చూస్తే ఏడ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ అలా ఎదగాలి అనుకున్నవాడు, తనకు ఇతరులు అడ్డుగా ఉంటారేమో అనో లేదా వాళ్ళను తన ఎదుగుదలకు వాడుకుందాం అనో అనుకుంటేనే ప్రమాదం వస్తుంది. ఇలా ఎదిగిన వాడిని చూసే వాడు ఉండబోడు, వాడిని చూసి ఏడ్చే వాడు కూడా ఉండబోడు. ఇప్పుడు అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలన్ని ఒకనాడు ఇలాంటి రెండు ముఖాలతో బ్రతికినవే. ముందు స్నేహాలంటారు, వెనకాల చిచ్చుపెట్టే పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం తీవ్రవాద సంస్థలను సృష్టించేది వాళ్ళే, వాటిని ఆయా దేశాలపైకి ఉసిగొలిపి వాటిని దెబ్బగొట్టి, తమ స్థాయి ఎప్పుడు పై చేయిగా చూసుకునేది వాళ్ళే. ఆయా బాధిత దేశాలు తీవ్రవాదులపై యుద్దానికి బయలుదేరితే, వాళ్ళను సృష్టించడానికి ఖర్చు బోలెడు అయ్యింది కాబట్టి, అది నష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో, వాళ్ళతో శాంతి చర్చలు అంటూ నాటకాలు ఆడేది వీళ్లే.

ఇలాంటి రెండు ముఖాల దేశాలతో తిప్పలు పడిన వారు అనేకం. విద్వేషాలు రెచ్చగొట్టడం, శాంతి అంటూ ఆయా తీవ్రవాద సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వాళ్ళ రెండో ముఖానికి సాక్ష్యం. దానితో ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోవడం, ప్రతిదానికి ఈ అగ్రరాజ్యాలపై ఆధారపడటం చేస్తాయి కాబట్టి, వీళ్ళ వ్యాపారం బాగుటుంది. అంటే గాయం చేసేది వాళ్ళే వైద్యం అంటూ డబ్బులు లాగేసుకునేది వాళ్లే. ఇలాంటి వ్యవస్థలను ఇక సహించేది లేదనే నిర్ణయానికి ఇథియోపియా అధ్యక్షుడు వచ్చేశారు. దానితో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఉగ్రమూకల ను అణిచేయడానికి సిద్ధం అయ్యారు.

తనకు ప్రపంచ శాంతి దూతగా చేతిలో పతకం పెట్టి, జరుగుతున్నది చూస్తూ ఊరుకోమంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. సైన్యానికి, ఉగ్రభూతాలకు మధ్య జరిగే పోరాటంలో తాను పాల్గొంటానని, సైన్యంతో నడవడం మొదలుపెట్టారు. ఆయుధాలు ఇంకెన్నాళ్లు దేశాలను శాసిస్తాయి, ఇక సహించేది లేదు. పోరాటానికి సిద్దమే అంటూ ఆయన సైనిక దుస్తులలో పరిస్థితిని ప్రతిఘటించడానికి సిద్ధం అయ్యారు. ఇథియోపియా లో ఇప్పుడు పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. టీపీఎల్ఎఫ్ సంస్థలు అక్కడ అనేక విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దానిని ప్రతిఘటించడానికి స్వయంగా అధ్యక్షుడు సిద్ధం అయ్యారు. యూరోపియన్ యూనియన్, నాటో, అమెరికా లాంటి దేశాలు ఇలాంటి రెండు ముఖాలు పెట్టుకుని తమ కుటిల రాజకీయాలను అమలు చేస్తున్నాయి. వాళ్ళ ఆధిపత్యం కోసం ఇతర దేశాలలో గందరగోళాలు సృష్టిస్తున్నారు.

అమెరికా, రష్యా లు కూడా అటు భారత్ కు మద్దతు అంటూ ఒక ముఖం తో చెపుతూ, మరో ముఖంతో పంజాబ్ తీవ్రవాదం ఖలిస్థాన్ కు కూడా పెట్టుబడులు ఇస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ ఆధిపత్యం కోసం దాష్టికాలు చేస్తున్నారు. ప్రపంచ శాంతి దూతగా బహుమతి తీసుకున్న ఇథియోపియా అధ్యక్షులు స్వయంగా ఆయుధాలు పట్టి దేశాన్ని కాపాడుకుందాం అని తన పౌరులను ఉత్సాహపరుస్తున్నారు. 12 కోట్లు జనాభా ఉన్న మనం ముష్కరులను తొక్కి అవతల పారేయలేమా అని ఆయన పౌరులకు పిలుపు నిస్తున్నారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పాశ్చాత్యదేశాల ఆధిపత్యాన్ని సహించలేని ఆ దేశాలు ఇలా పోరాడుతుంటే, మిత్రమా నువ్వెంటి, నీ దేశం ఏంటి. ఎవరో వచ్చి, ఇక్కడ నాది అనడం ఏంటి. ఇకనైనా మేలుకో!

మరింత సమాచారం తెలుసుకోండి: