తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చి పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళుతోంది. దీని కోసం గ‌త కొన్నేళ్లుగా రాజ‌కీయాలు చేస్తోంది. కేసీఆర్ కు చెక్ పెట్టడమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ త‌రువాత రెండో స్థానంలోకి ఎగబాకి నట్లు వాతావరణం క్రియేట్ సృష్టిస్తోంది. బిజెపి రాష్ట్ర‌ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం పై పోరాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆ మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై గళం విప్పిన బండి సంజ‌య్‌.. ఇప్పుడు జీవో నెంబర్ 317 ర‌ద్దు చేయాల‌ని వ్యతిరేకంగా పోరాడుతున్నారు.


 ఈ పోరాటంలో అరెస్ట్ కూడా అయి.. రెండు రోజులు జైలులో ఉండి బెయిలు మీద బయటకు వచ్చిన బండి  కేసీఆర్ పోరు మ‌రోసారి పోరు మొద‌లు పెట్టారు.  ఇక‌ కేంద్ర పెద్దలు కూడా బండికి ఫోన్ చేయ‌డంతో పాటు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వ‌రుస‌ పెట్టి జాతీయ నేతలు తెలంగాణ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.న‌డ్డా, మధ్యప్రదేశ్ సీఎం తెలంగాణ‌కు వ‌చ్చారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాగానే పోరాడుతున్నా కానీ కొందరు నేతలు పైకి ఏదో హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


 జాతీయ నేతల దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో వారు కూడా కేసీఆర్ ని డైరెక్టుగా టార్గెట్ చేసుకుంటున్నారు. స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టడం లేదు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉన్నట్లు కనిపించడం లేదు.. ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో కమలం పార్టీ బలోపేతం కాదు అందరూ ఏదో రాష్ట్ర స్థాయిలో హడావిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. మొదటి నుంచి పార్టీకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయిలో ఎన్ని విమర్శలు చేసినా క్షేత్రస్థాయిలో బ‌ల‌ప‌డ‌క‌పోతే బీజేపీ ఆశించిన ఫలితం అందుకోవడం కష్టమేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP