దేశం మొత్తం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల్లో ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ.. ఎన్నిక‌లు వాయిదా వేయాలి.. అస‌లు, ఎన్నిక‌లే జ‌ర‌ప‌కూడ‌దు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ, ఇప్పుడు ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన బెంగాల్ ఎన్నిక‌ల్లో ఇదే విధంగా అనేక ద‌శల్లో ఎన్నిక‌లు పెట్ట‌డం వ‌ల్ల సెకండ్‌వేవ్ లో భారీగా కేసులు పెరిగేందుకు కార‌ణ‌మ‌యింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు కూడా ఏడు ద‌శ‌ల్లో జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించ‌డం ఆందోళ‌న‌ను కలిగిస్తోంది.


  ఈ నిర్ణ‌యం ప్ర‌జారోగ్యాన్ని దెబ్బ‌తీసేలా ఉంద‌ని, సెకండ్ వేవ్ సృష్టించిన డెల్టా వేరియంట్ కంటే ఐదు రేట్లు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేవ్‌లో భారీ షేడ్యూల్‌ను పెట్ట‌డం స‌మంజ‌స‌మా అని రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో పాటు గ‌తంలో రెండు, మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంతో పోలిస్తే ఇప్పుడు వ‌స‌తులు, సాంకేతిక‌త‌ ఎక్కువ‌గా అందుబాటులో ఉంది. అయితే, యూపీలో ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హణ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఎక్కువ రోజుల నిర్వ‌హించాల్సి వ‌స్తుంది. ఒక ద‌గ్గ‌ర షెడ్యూల్ విడుద‌ల అయిన త‌రువాత ఇంకోచోట ప్ర‌చారం నిర్వ‌హించాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల పెద్ద పార్టీల‌కు మంచి అవ‌కాశంగా మారుతుంది.


     నిధులు ఎక్కువ‌గా ఉన్న పార్టీల‌కు ద‌శ‌ల వారీ ఎన్నిక‌ల వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌నేది వాస్త‌వం. అయితే, ఎన్నిక‌ల బాండ్‌ల‌లో అత్య‌ధికంగా అధికార బీజేపీకి నిధులు వెళ్తున్నాయి. దీంతో యూపీలో ఏడు ద‌శ‌ల ఎన్నిక‌లు సానూకూలంగా మారే అవ‌కాశం ఉందనే వాద‌న వినిపిస్తోంది. దీంతో పాటు  బీజేపీని దృష్టిలో ఉంచుకుని ఏడు ద‌శ‌ల్లో ఎన్నికల నిర్వ‌హిస్తున్నారా అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అలాగే, ఒకే సారి ఎన్నిక‌లు జ‌రిపితే రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఒకే సారి ప్ర‌చారం నిర్వ‌హిస్తుంది.



 అయితే, అధికార పార్టీ అగ్ర నేత‌లు కూడా ప్ర‌చారంలో పాల్గొంటారు.. అందువ‌ల్ల ఒకే ఫేజ్‌లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగితే వీళ్లు ప్ర‌చారం చేయ‌డానికి వీలుండ‌దు.. కాబ‌ట్టి ప్ర‌ధానమంత్రి, హోంమంత్రి ఎక్కువ రాష్ట్రాలు, ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించాలంటే ఎక్కువ ద‌శ‌ల్లో ఎన్నిక‌లు ఉంటే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగానే ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల నిర్వ‌హిస్తున్నార‌నేది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.


 



     

మరింత సమాచారం తెలుసుకోండి: