ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్లో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తాలిబన్లు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు   ఉగ్రవాదం అనే పదానికి మరో రూపమైన తాలిబన్లు ఆయుధాలతో ఎన్నో ప్రాణాలు తీసి చివరికి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని  వశం చేసుకున్నారు. ఇక ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాలను అమలు లోకి తీసుకువచ్చి ప్రజలందరినీ బానిసలుగా మార్చుకున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నుంచి తాలిబన్లు ఎన్నో అరాచకాలు సృష్టించారు. అయితే ఆయుధాలతో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఆధిపత్యాన్ని చేపట్టిన తర్వాత ఇక ఇప్పుడు  మరికొన్ని దేశాలలో కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు అన్నది అర్ధమవుతుంది.



 ఈ క్రమంలోనే ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా అల్లాడిపోయిన ఇరాన్ లో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో అటు ఆప్ఘనిస్థాన్లో జరిగిన పరిస్థితులనే ఇరాన్లో కూడా రిపీట్ చేయాలని కొన్ని ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మొన్నటి వరకూ సైలెంట్ గా ఉండి పోయిన ఉగ్రవాదులు ఇక ఇప్పుడు మళ్లీ బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇబ్బందులను సృష్టించడం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఇక ఇటీవలే ఇరాన్లో జరిగిన ఒక కీలక పరిణామం ఉగ్రవాదులు మళ్లీ బలపడుతున్నారు అనే దానికి నిదర్శనం గా మారిపోయింది అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా అన్ని దేశాల్లో లాగా ఇరాన్లో ప్రైవేట్ మీడియా సంస్థలు ఉండవు... కేవలం ప్రభుత్వ మీడియా మాత్రమే ఉంటుంది. ఇక ఇటీవలే ప్రభుత్వం మీడియా సంస్థలు హ్యాక్ చేయడం సంచలనంగా మారిపోయింది. కొన్ని గంటల పాటు ప్రభుత్వ మీడియా సంస్థ హాక్ కాగా ఎంతో కష్టపడి సమస్య పరిష్కరించారు. ఇక దీనిపై విచారణ జరపగా ఒకప్పుడు సద్దాం హుస్సేన్ సహాయం చేసినటువంటి ముఠాలోని కొంతమంది ఇది చేసినట్లు తేలింది. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది ఉగ్రవాదులు బల పడుతున్నారన్నదానికి ఈ ఘటన నిదర్శనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: