కేంద్ర బ‌డ్జెట్ పై కేసీఆర్ స్పందించారు.అస్స‌లు వీళ్ల‌కో ఆలోచ‌న అంటూ లేద‌ని చెబుతూ అందుకు త‌గ్గ ఉదాహ‌ర‌ణ‌లు చెప్పారు.ఇదే స‌మయంలో, ఇదే సంద‌ర్భంలో కొన్ని కోత‌ల‌పై కూడా ఆయ‌న సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. అంతేకాదు మోడీ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌న్నీ, తెలంగాణ‌కు ఇచ్చిందేమీ లేద‌ని, ముఖ్య‌మ‌యిన ప‌థ‌కాల్లో కోత‌లు విధించ‌డ‌మే కాక ఆహార స‌బ్సిడీకి కూడా కేటాయించాల్సిన నిధుల్లోనూ కోత‌లు విధించ‌డం త‌గ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


తెలుగు రాష్ట్రాల‌కు జ‌రిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ‌కు సంబంధించి జ‌రగ‌ని బ‌డ్జెట్ కేటాయింపుల‌పై కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఏ విధంగా చూసుకున్నా ఇది ప్ర‌గ‌తి శీల బ‌డ్జెట్ కాద‌ని ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని అంటున్నారు. బ‌డ్జెట్ పై కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో అనేక ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.ముఖ్యంగా ఆయ‌న నదుల అనుసంధానంపై మాట్లాడారు. అదొక మిలినియం జోక్ అని తేల్చారు. అదేవిధంగా నదుల అనుసంధానం ఏ ప్రాతిప‌దికన చేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.దేశంలో 65వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా మ‌నం మాత్రం అందులో స‌గం కూడా వినియోగించుకోలేక‌పోతున్నామ‌ని ఆవేద‌న చెందారు.

రైతాంగానికి ఈ బ‌డ్జెట్ లో ద‌క్కింది ఏమీ లేద‌ని, అస‌లు సేద్య‌గాడికి మోడీ అందించిన సాయం ఏంటో చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాదు ఏ రంగానికీ ఉత‌మివ్వ‌ని బ‌డ్జెట్ ఇదేన‌ని, ఆరోజు గుజ‌రాత్ మోడ‌ల్ అంటూ నాలుగు అబ‌ద్ధాలు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుని అధికారంలోకి వ‌చ్చార‌ని, అధికారం చేప‌ట్టాక ఎనిమిదో బ‌డ్జెట్ ఇది అని, ఇంత పేలవంగా ఉంటుంద‌ని తాను ఊహించ‌లేద‌ని కేసీఆర్ అన్నారు.

ప‌వ‌ర్ పాలసీకి సంబంధించి అదేవిధంగా వాట‌ర్ పాల‌సీకి సంబంధించి కేంద్రానికో స్ప‌ష్ట‌త లేదు అని అన్నారు.విద్యుత్ మీట‌ర్లు ఏర్పాటు చేసి రైతు ముక్కు పిండి డ‌బ్బులు వసూలు చేయాల‌ని భావించ‌డం త‌గ‌ద‌ని చెప్పారు.ఇదే కాదు ఏ పాల‌సీ కూడా ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా లేవ‌ని, ఆ రోజు సాగు చ‌ట్టాల గురించి రోడ్డెక్కిన రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నా దానిపై ఒక్క మాట అంటే
ఒక్క మాట కూడా ప్ర‌స్తావించ‌లేద‌ని చెప్పారు. అదేవిధంగా ఉపాధి ప‌థ‌కంలోనూ,ఇంకా ఇత‌ర ప‌థ‌కాల్లో కోత పెట్టార‌ని అన్నారు.
ఇవేవీ త‌గ‌వ‌ని వారికోవిజ‌న్ లేద‌ని చెప్పేందుకు ఈ బ‌డ్జెట్ అని వివ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: