మన దేశంలో వివాహాలు అంటే అట్టహాసాలు, ఆర్భాటాలు ఎక్కువున్న సంగతి తెలిసిందే. అలాగే, బజాబజంత్రీ లతో వివాహా మండపానికి వేంచేస్తుంటారు. అయితే గుజరాత్ రాష్ట్రం లోని డైమండ్ నగరంగా ప్రసిద్ధి గాంచిన సూరత్ లో మాత్రం పెళ్ళికొడుకులు ఇటీవల పర్యావరణ పరిరక్షణ నడుంబిగించి దాని మీద అవగాహన కల్పించేందుకు  వివాహ మండపాలకు సైకిళ్ళ పై చేరుకుంటున్నారు. 



మధ్య భారత దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన సూరత్ అత్యంత కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయాన్ని కేంద్ర కాలుష్య బోర్డు తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ప్రమాదకార స్థాయికి పెరుగుతోంది. వాయు కాలుష్యం మితిమీరితే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు , ఊపిరితిత్తుల క్యాన్సర్ లకు దారితీస్తుంది. అంతేకాకుండా అక్కడి వజ్రాల పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యం కారణంగా నీరు , ఆహార పదార్థాలు కలుషితంగా మారుతున్నాయి. 



ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సూరత్ పెళ్లికొడుకులు తాము పర్యావరణ హితంగా నడుచుకోవడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని భావించి పెళ్లి మండపాలకు తమ బంధువులతో కలిసి సైకిళ్ళ తో హాజరవుతున్నారు. సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగే సామూహిక వివాహా మహోత్సవానికి ఇలా రావడం ప్రారంభించారు. దశాబ్దల కాలంగా వస్తున్న తమ సంస్కృతి కంటే పర్యావరణ పరిరక్షణ కె పెద్ద పీట వేస్తున్నారు. 



సాధారణంగా సౌరాష్ట్ర సంప్రదాయం ప్రకారం అయితే పెళ్లి కొడుకులు వివాహా వేదికకు తమ బంధువులతో కలిసి , తాము గుర్రాలపై , కార్లలో మెల్లగా ఊరేగింపు గా మేళతాల తో విచ్చేస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాయు కాలుష్యానికి దారితీయకుండా సూరత్ పెళ్లి కొడుకులు సైకిళ్ళు పై  విచ్చేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మొదట సౌరాష్ట్ర లోని పెద్ద పెద్ద నగరాల్లో అలాగే ఆచరిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరి కోసం. ప్రత్యేక టెరిమినల్స్ నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: