10 వ తరగతి పరీక్షల ప్రభావం సెలవులపై పడనుందా అంటే అవుననే వినిపిస్తోంది. అసలే కరోనా కారణంగా స్కూల్స్, కాలేజీలు లేక పిల్లల చదువు అటకెక్కింది. పిల్లల చదువు , జ్ఞానంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. లాక్ డౌన్ పేరిట పాఠశాలలు, కళాశాలలు అన్నీ బంద్ అవడంతో విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మధ్య మధ్యలో అలా కొన్ని రోజులు విద్యాలయాలు తెరిచినప్పటికీ కరోనా భయంతో చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపలేదు. అయితే ఇక ఇపుడేమో ఎండాకాలం సెలవులు పొడగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం 10 తరగతి పరీక్షలేనట.

పదవ తరగతి పరీక్షలు ఆలస్యం అవుతున్నందున పాఠశాలలను వచ్చే నెల ఏప్రిల్ ఆఖరి వరకు నడిపి మే మొదటి వారం నుండి వేసవి సెలవులను ఇవ్వాలని విద్యా సంస్థలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం అధికారుల చేతిలో ఉండనుంది. కాగా పదవ తరగతి పరీక్షలు లేట్ అవుతున్న కారణంగా ఏప్రిల్ ఎండింగ్ వరకు వర్కింగ్ డేస్ గా పరిగణలోకి తీసుకుని మే లో సెలవులు ఇచ్చి మళ్ళీ జూలై మొదటి వారం లో తిరిగి పాఠశాలలను ప్రారంభించనున్నారు అని సమాచారం.

సాధారణం గా జూన్ 12 నుండి ప్రతి ఏడు పాఠశాలలు తిరిగి రీఓపెన్ చేస్తారు అయితే 10 వ తరగతి పరీక్షలు లేట్ అవుతున్నందున మే మొదటి వారం లో సెలవులు ఇచ్చి అనంతరం జూన్ చివరి వరకు కూడా సెలవులను కొనసాగించి తిరిగి జూలై లో స్కూల్స్ రీ ఓపెన్ చేయడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఇంటి పూట బడుల విషయానికొస్తే ఈ పాటికే మొదలయ్యి ఉండాలి కానీ...వచ్చే నెల మొదటి వారం నుండి నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు మూడు  రోజుల్లో ఈ విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: