
వాస్తవానికి కరీంనగర్ అసెంబ్లీలో బండి వరుసపెట్టి గంగులపై ఓడిపోతున్నారు...2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీలో బండి విజయం ఖాయమని అంతా అనుకున్నారు...కాకపోతే కేసీఆర్ సెంటిమెంట్ లేపడంతో బండి ఓటమి పాలయ్యారు. కేసీఆర్ గాలిలో ఓడిపోయారు. అయితే ఈ సారి కేసీఆర్ గాలి తక్కువ ఉంది...అటు బీజేపీ హవా పెరుగుతుంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే కరీంనగర్ అసెంబ్లీలో గంగుల హవా తగ్గేలా ఉంది..వరుసగా గెలుస్తూ వస్తున్న నేపథ్యంలో గంగులపై సహజంగానే వ్యతిరేకత కనిపిస్తోంది...ఇటు వరుసగా ఓడిపోతున్న సానుభూతి బండిపై ఉంది..పైగా ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు.
అధ్యక్షుడుగా ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు...పైగా ఆయన సీఎం అభ్యర్ధుల్లో ఒకరుగా ఉన్నారు..ఈ పరిణామాలు బండికి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి..ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి..నెక్స్ట్ మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది..అయితే వేములవాడలో కూడా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. కానీ కరీంనగర్ అసెంబ్లీపై కూడా బండి ఫోకస్ ఉందని, ఓడిన చోటే గెలవాలని బండి భావిస్తున్నట్లు అర్ధమవుతుంది..మొత్తానికి ఈ సారి గంగులకు బండి ఛాన్స్ ఇచ్చేలా లేరు.