చంద్రబాబునాయుడు హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారనే ఆరోపణలపై హైస్ కమిటి వేయాలని అసెంబ్లీ డిసైడ్ చేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు తమ మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు అప్పట్లోనే కొందరు ఆరోపణలు చేశారు. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వీళ్ళను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇంతకాలం దానిపై మళ్ళీ ఎలాంటి ఆరోపణలు వినబడలేదు.





అలాంటిది వారం రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాట్లాడుతు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు తాను తిరస్కరించినట్లు చెప్పారు. అయితే అదే సమయంలో చంద్రబాబు మాత్రం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాంతో ఏపీలో మమత వ్యాఖ్యలపై పెద్ద రచ్చే జరుగుతోంది. అప్పుడెప్పుడో చేసిన ఆరోపణలను ఇపుడు వైసీపీ ఎంఎల్ఏలు తిరిగి తోడుతున్నారు.





ఇదే సమయంలో అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపైన కూడా ఆరోపణలొచ్చాయి. ఏబీపై ఇదే విషయంలో దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇపుడు అదే ఆరోపణలపై అసెంబ్లీలో సభ్యుల డిమాండ్ కారణంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతు హౌస్ కమిటి వేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకటిరెండు రోజుల్లో హౌస్ కమిటి స్వరూపాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఇపుడు పెగాసస్ విషయమై హౌస్ కమిటి వేస్తే ఏమిటి ఉపయోగం ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఈ కమిటీలు, విచారణలు తనను ఏమీ చేయలేవని చంద్రబాబుకు బాగా తెలుసు.





చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికమిటీలు వేసినా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. మహామహా ఓటుకునోటు కేసులోనే చంద్రబాబును ఎవరు ఏమి చేయలేకపోయారు. ఇదేకాదు తాజాగా అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపైన విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకున్నా ఏమీ చేయలేకపోయింది. ఒకటికాదు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఉపయోగంలేకపోయింది. ఏదో నాలుగు రోజులు కాస్త హడావుడి చేయటానికి మాత్రం పనికొస్తుందంతే ఈ కమిటి.



మరింత సమాచారం తెలుసుకోండి: