ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బరాయుడుకు కొత్త రూట్ క్లియర్ అయిపోయింది..ఆయన వైసీపీ నుంచి బయటకు రావడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..ఇప్పటికే ఆయనే వైసీపీకి దూరంగా ఉండే రాజకీయం చేస్తున్నారు..ఇక నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి..ప్రస్తుతం ఉన్న రాజకీయాలని బట్టి చూస్తే ఆయనకు ఉన్న ఆప్షన్స్ రెండే..ఒకటి టీడీపీ, రెండు జనసేన...ఇప్పటికే పలుమార్లు టీడీపీలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి...ఈ సారి కొత్తపల్లి జనసేన వైపుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే కొత్తపల్లి ఖాతాలో మరో కొత్త పార్టీ రానుందని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇప్పటివరకు కొత్తపల్లి ఎన్ని పార్టీల్లో రాజకీయం చేశారో చెప్పాల్సిన పని లేదు...ఆయన రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే...టీడీపీ నుంచి పలుమార్లు నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారు..మంత్రిగా పనిచేశారు...అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఒక కాపు వర్గం నాయకుడుగా కొత్తపల్లి టీడీపీలో ఉండలేకపోయారు..వెంటనే ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009లో నరసాపురంలో పోటీ చేసి ఓడిపోయారు..ఇక ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో విలీనం కావడంతో, ఆ పార్టీ నేతగా మారిపోయారు.

అలాగే 2012 నరసాపురం ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు...తర్వాత టీడీపీలోకి వచ్చి...2014 తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. అలా అని టీడీపీలోనే కొనసాగలేదు..2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు...కానీ వైసీపీలో ఆయనకు సీటు రాలేదు. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన ముందునూరి ప్రసాద్ రాజు గెలుపుకు కృషి చేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో కొత్తపల్లికి ఏదొక పదవి వస్తుందని అనుకున్నారు...కానీ ఆయనకు పదవి రాలేదు..దీంతో నిదానంగా వైసీపీ దూరం జరిగారు..తాజాగా నరసాపురంని జిల్లా కేంద్రంగా చేయాలని పోరాటం చేస్తున్నారు..అలాగే ప్రసాద్ రాజుని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారు. అయితే కొత్తపల్లి ఎన్నిసార్లు చెప్పుతో కొట్టుకున్న పర్లేదు అని మంత్రి పేర్ని నాని అంటున్నారు...అంటే వైసీపీ కొత్తపల్లిని వదిలేసినట్లే..ఇక కొత్తపల్లి కూడా వైసీపీని వదిలేసినట్లే..మరి ఆయన కొత్తగా జనసేనలోకి వెళ్తారో లేదా మళ్ళీ టీడీపీలోకి వెళ్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: