ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో సైనికులకు ఫుల్ పవర్స్ వచ్చిన నేపథ్యంలో ఇక ఉగ్రవాదులను చీల్చి చెండాడుతూన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా గుర్తిస్తూ ఎన్ కౌంటర్ చేస్తూ మట్టి పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సైన్యం దూకుడుకి ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియక ఉగ్రవాదులు అనుక్షణం భయపడిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయ్. ఇలా ఒకప్పుడు జమ్మూకాశ్మీర్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల ఆటలు ఇప్పుడు ఎక్కడ సాగడంలేదు అన్నది తెలుస్తుంది.


 గత కొన్ని నెలల నుంచి వరుసగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న భారత ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి ఎక్కడికక్కడ మట్టు పెడుతుంది.  ఇటీవలే మరోసారి భారీ ఎన్కౌంటర్ చేసింది భారత ఆర్మీ.  బారాముల్లా జిల్లాలోని ఓ గ్రామంలో ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది అని తెలుస్తుంది. అయితే ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం మేరకు తెల్లవారుజాము నుంచే కాశ్మీర్ పోలీసులతో కలిసి సరిహద్దు భద్రతా బలగాలు భారముల్లా జిల్లాలోని మాల్వా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టాయి.



 ఈ క్రమంలోనే సైన్యాన్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులు జరపడం గమనార్హం   ఇక ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ను కూడా మట్టి పెట్టినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించారు.  సంఘటన స్థలంలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు అని చెప్పుకొచ్చారు. హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు అంటూ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: