లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)  ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కొనసాగుతున్న ప్రక్రియపై స్టే ఆర్డర్‌ను ఉంచడానికి సుప్రీంకోర్టు గురువారం నాడు నిరాకరించడం జరిగింది. ఎల్‌ఐసీ ఐపీఓ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. IPO lic చట్టం, 1956లోని కొన్ని సెక్షన్‌లను ఉల్లంఘిస్తోందని విజ్ఞప్తులు సూచిస్తున్నాయి.ఎల్‌ఐసి ఐపిఓకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది కానీ అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయితే ఎల్‌ఐసీ ఐపీఓ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్రం లేదా ఎల్‌ఐసీ ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు వారాల తర్వాత పిటిషనర్ల నుంచి స్పందన రావాలని సుప్రీమ్ కోర్టు పేర్కొంది.ఎల్‌ఐసీ ఐపీఓపై అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం జరుగుతున్న వాటా కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి జోక్యం ఉండదని అర్థం.ఆర్థిక చట్టం, 2021 ద్వారా ఎల్‌ఐసి చట్టం, 1956కి చేసిన సవరణల చెల్లుబాటును సుప్రీంకోర్టు ఇప్పుడు పరిశీలిస్తుంది. ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద IPOలలో ఒకటని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నారు.73 లక్షల మంది దరఖాస్తుదారులు పాల్గొన్నారు మరియు 22.13 కోట్ల షేర్లు ఒక్కో షేరుకు రూ. 939 ప్రీమియంతో విక్రయించబడ్డాయి. ఐపీఓకు 73 లక్షల మంది దరఖాస్తుదారుల నుంచి బిడ్లు వచ్చాయని, ప్రభుత్వానికి రూ.22,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఇదిలావుండగా, పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది మాట్లాడుతూ, ప్రజల హక్కులు ప్రమేయం ఉన్నందున ప్రభుత్వం ఎల్‌ఐసి ఐపిఓను విక్రయించాలనే నిర్ణయాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం చట్టబద్ధత తప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: