కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని  రైతులకు 11వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక వీటికి అర్హులైన రైతుల అకౌంట్లలోకి రూ.2,000 చొప్పున జమ చేసింది. అయితే ఇక్కడ ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే రూ.2,000 అకౌంట్‌లో జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించింది.పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ పూర్తిచేయడానికి 2022 మే 31 దాకే గడువు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ గడువు కూడా ఇటీవల ముగిసింది. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 2022 జూలై 31 దాకా పీఎం కిసాన్ ఇకేవైసీ గడువును పొడిగించింది. దీంతో ఇకేవైసీ చేయని రైతులకు మరో అవకాశం కూడా లభించింది.ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో రిజిస్టర్ అయిన రైతులు ఇకేవైసీ తప్పనిసరి అని, ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉందని, లేదా రైతులు దగ్గర్లో ఉన్న సీఎస్‌సీ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేయొచ్చని ఇంకా ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 జూలై 31 దాకా గడువు ఉందని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది.ఇక రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ ప్రాసెస్ ని పూర్తి చేయొచ్చు.



పీఎం కిసాన్ వెబ్‌సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.ఇక ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. ఇక ఇప్పటికే ఇకేవైసీ పూర్తి చేసిన రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో స్టేటస్ ని చెక్ చేయొచ్చు. ఇక పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 కోట్లకు పైగా రైతులకు రూ.21,000 కోట్లని విడుదల చేసింది. ఇది పీఎం కిసాన్ పథకంలోని 11వ ఇన్‌స్టాల్‌మెంట్ . ఏప్రిల్-జూలై కి చెందిన ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ప్రస్తుతం రిలీజైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా మొత్తం రూ.6,000 జమ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: